BigTV English

CM Jagan – Bandla Ganesh : పవన్ టార్గెట్ గా జగన్ వ్యాఖ్యలు.. ఖండించిన బండ్ల గణేష్

CM Jagan – Bandla Ganesh : పవన్ టార్గెట్ గా జగన్ వ్యాఖ్యలు.. ఖండించిన బండ్ల గణేష్

CM Jagan – Bandla Ganesh : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను సీఎం జగన్ టార్గెట్ చేశారు. ఆయన పెళ్లిళ్ల దగ్గర నుంచి పోటీ చేసే స్ధానాల వరకు తనదైన శైలిలో విమర్శులు గుప్పించారు జగన్. మూడేళ్లకోసారి పెళ్లాలను మార్చినట్టు..నియోజవర్గాన్ని కూడా మారుస్తారని ఫైర్ అయ్యారు. అయితే సీఎం జగన్ ఈ విధమైన కామెంట్స్ వెనుక కొన్ని ఈక్వేషన్స్ లేకపోలేదంటున్నారు రాజకీయ నిపుణులు. ఈ సారి పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో పోటి చేసిన గాజువాక, భీమవరం స్ధానాలను కాదని.. తిరుపతి నుంచి పోటి చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకే పవన్ పై సీఎం జగన్ ఈ రకమైన వ్యాఖ్యలు చేసారని తెలుస్తోంది.


అయితే రాయలసీమలో పవన్ ప్రభావం పడకుండా.. ఆయన పోటీ చేయకూడదనే ఉద్దేశంతోనే సీఎం జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. వైసీపీ బలంగా ఉన్న రాయలసీమలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే.. ఓట్లు చీలే అవకాశం ఉందని.. ఆ కారణంగానే ముందు జాగ్రత్తగా ఈ వ్యాఖ్యలు చేశారని జనసేన నేతలు అభిప్రాయపడ్డారు. మరోవైపు పవన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన పవన్ పై మండిపడుతున్నారు జనసేన శ్రేణులు. వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాల నుంచి ఒక్క సీటు కూడా రాకుండా చేస్తామని సవాల్ విసురుతున్నారు.

కాగా.. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఖండించారు. పవన్ కల్యాణ్ సమాజానికి ఉపయోగపడే మనిషి అని, ఆయన గురించి పూర్తిగా తెలియకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. నిన్న సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు విన్నప్పటి నుంచి మనసులో ఒకటే వేదనగా ఉందన్నారు. ఒక హోదాలో ఉన్న సీఎం జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. పవన్ కల్యాణ్ ఎవరు కష్టాల్లో ఉన్నా ఆదుకునేందుకు ముందుంటారన్నారు. పవన్ కల్యాణ్ గురించి విమర్శించాలంటే.. ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన పెళ్లిళ్లు ఒక్కటే కనిపిస్తాయని, అందుకే పదే పదే వాటి గురించి మాట్లాడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎవరి వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పార్టీ నడుపుతున్న నేత పవన్ కల్యాణ్ అని బండ్ల గణేష్ కొనియాడారు. పవన్ కల్యాణ్ కు కులపిచ్చి లేదని బండ్లగణేష్ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ గురించి పూర్తిగా తెలియకుండా.. ఆయనపై ఇలాంటి అభాండాలు వేయొద్దని విజ్ఞప్తి చేశారు.


Related News

Vijayawada Traffic Diversions: మూల నక్షత్రంలో సరస్వతిదేవిగా దుర్గమ్మ దర్శనం.. రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

CM Chandrababu Meets Pawan: డిప్యూటీ సీఎం నివాసానికి సీఎం చంద్రబాబు.. ఉత్కంఠగా మారిన భేటీ?

Tirumala: గుడ్ న్యూస్.. తిరుమల శ్రీవారి భక్తులకు మరో కానుక

Drone At Srisailam: శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం.. అదుపులో ఇద్దరు యువకులు

AP Assembly: సొంత అజెండాతో బొత్స.. జగన్‌ను అవమానిస్తున్నాడా?

RTC BUS: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు రచ్చ రచ్చ.. ఎక్కడంటే..!

AP Govt: డ్వాక్రా మహిళలకు ఏపీ శుభవార్త.. ఆ శ్రమ తగ్గినట్టే, ఇంటి నుంచే ఇకపై

Auto Driver Sevalo Scheme: అక్టోబర్ 4న ఖాతాల్లో రూ.15 వేలు.. మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

Big Stories

×