ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ప్రతిపక్ష వైసీపీ నేతలు చేస్తున్న విషప్రచారం, విమర్శలపై కూటమి మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఏకంగా సహనం కోల్పోతున్నారు. ఆధారం లేకుండా మాట్లాడటమే కాదు.. అచ్చిరాని తప్పుడు ఆరోపణలు చేయడంపై కూటమి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు సైతం మండిపడుతున్నారు.ఒకానొక సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు మండలి చైర్మన్ సైతం విసుగు చెందుతున్నారంటే అతిశయోక్తి కాదు. మొత్తం రాష్ట్రాన్ని వైసీపీ సభ్యులు తమ అస్యత ఆరోపణలతో ఒక డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర లేపుతున్నారని పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో ఏదో పెద్ద తప్పు జరుగుతోందని, కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అందుకు బాధ్యత వహించాలని పేర్కొంటూ అసెంబ్లీ వేదికగా వైసీపీ నేతలు విషప్రచారం మొదలెట్టారు.
ఉభయ సభల్లో వైసీపీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అరాచకం సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది.వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు, మంత్రులు సమాధానాలు చెప్పకుండా అడ్డుతగలడం, వారికి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ హయాంలో అభివృద్ది జరిగిందని, చంద్రబాబు వచ్చాక రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సాగుతోందని అనేలా వారు మాట్లాడటంపై కూటమి మంత్రులు సహనం కోల్పోతున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశాన్ని పదే పదే సభావేదికగా ప్రస్తావిస్తూ అటు స్పీకర్, ఇటు మండలి చైర్మన్‌కు సైతం వైసీపీ నేతలు తలనొప్పి తీసుకువస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే వారికి సభ నుంచి బయటకు పంపించి వేయాలని స్పీకర్ ఆదేశిస్తే వారంతట వారే బయటకు వెళ్లిపోయి ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం తమను అణచివేస్తోందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో వైసీపీ నేతల ప్రవర్తనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఫైర్ అయ్యారు. ఉన్నదే 11 మంది ఎమ్మెల్యేలు.. వీరు ఏదో తాము 1100 మంది అనేలా కూటమి ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేల మీద విరుచుకపడటంపై పవన్ సీరియస్ అయ్యారు. జగన్ ఐదేండ్ల పాలనలో అడ్డగోలుగా అప్పులు చేశారని, దాంతో రాష్ట్రంపై సుమారు రూ.8 లక్షల కోట్ల మేర అప్పు ఉందని, సంక్షేమం, విద్యావైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు మరల అప్పులు చేయాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.గత ప్రభుత్వం కేవలం సంక్షేమం పేరిట రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని మండిపడ్డారు. వైసీపీ నేతల తప్పులు ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కూటమి నేతల మధ్య ఐక్యవ అవసరమని అన్నారు.
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?..
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నందున వాళ్లు చెప్పేవి ప్రజలు సులువుగా నమ్మే అవకాశం ఉందని, అందుకే కూటమి నేతలు అటు సోషల్ మీడియాతో పాటే మిగతా అన్ని విషయాల్లో అలర్ట్‌గా ఉండాలని సూచించారు. వారు చెప్పే మాటలు, ప్రభుత్వంపై వేస్తున్న నిందలు ప్రజలకు రీచ్ కాకముందే ఆధారాలతో సహా వాటికి కౌంటర్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అసెంబ్లీ వేదికగా పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, ఇప్పుడున్న ప్రభుత్వం ఎంత అప్పు చేసింది అనే అంశాలతో పాటే మాజీ సీఎం జగన్ చెల్లించుకుండా వెళ్లిన రూ.35వేల కోట్ల పెండింగ్ బిల్లులను కూటమి సర్కార్ ప్రస్తుతం చెల్లిస్తున్నదని, ఇప్పటివరకు రూ.25 వేల కోట్ల మేర రీపేమెంట్స్ చేసినట్టు పవన్ కళ్యాన్ వెల్లడించారు. ఇలా గత ప్రభుత్వం చేసిన తప్పులను తాము సరిచేస్తుంటే ఇష్టానుసారంగా అబద్ధపు ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.ఏపీ ప్రజలు సైతం మరోసారి వైసీపీ కుట్రలో పడకూడదని ఆయన పిలుపునిచ్చారు. పవన్ చెప్పింది అక్షరాల నిజమని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.