E-Paper
Advertisement

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!
Advertisement

YS Jagan: ఏపీలోని గుంటూరు నగరంలో మహిళను వివస్త్రను చేసిన ఘటనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడు చేసిన ఈ దాడి మానవత్వానికే మాయని మచ్చ అని మండిపడ్డారు. రాష్ట్రంలోని శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పేందుకు ఈ ఘటనే నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు. సీఎం చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఘాటుగా వాఖ్యానించారు.

బుధవారం జరిగిన ఈ ఘటనను 3 రోజుల పాటు కప్పి పెట్టారని ఎక్స్ వేదికగా జగన్ ఆరోపించారు. చివరకు వీడియోలు బయటకు రావడంతో.. ప్రజలంతా చూసి అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు తానేదో చర్యలు తీసుకుంటున్నట్లుగా చంద్రబాబు హడావుడి చేయడం సిగ్గుచేటన్నారు. ఆ వీడియోలు కప్పిపుచ్చేదానిపై చూపిన శ్రద్ద.. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పుడే తీసుకొని ఉంటే బాగుండేదని పేర్కొన్నారు.

Advertisement

బాధితురాలు ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేసి.. నిందుతుల్ని అదుపులోకి తీసుకొని ఉంటే ఈ దారుణం జరిగేదా? అని ప్రశ్నించారు. ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయం? అని నిలదీశారు. ‘పోలీస్‌స్టేషన్లు ఉన్నది ఎందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా? లేక అధికార పార్టీ నాయకులు ఏంచెప్తే అది చేయడానికా?’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నేతలు, శ్రేణులపై దాడులను చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని జగన్ అన్నారు. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చారన్నారు. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా చేసుకున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు, బాధితులపై అక్రమంగా కేసులు పెడుతూ.. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ గా దిగజార్చారని పేర్కొన్నారు.

Advertisement

Also Read: లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

అధికార పార్టీ నాయకులు ఏం చేసినా ఈ పోలీసులు తమను రక్షిస్తారనే ధైర్యం ఊరూరా పాకిందన్నారు. అందుకే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారంటూ ఘాటుగా విమర్శించారు. దారుణాలు చేసినా, మహిళలను అవమానించినా తమను కాపాడటానికి చంద్రబాబు ఉన్నారనే ధైర్యం టీడీపీ నేతలు, శ్రేణుల్లో పెరిగిందన్నారు. ఇది చివరకు రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసిందని జగన్ మండిపడ్డారు.

Also Read: Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

Related News

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×