BigTV English

PM Modi Vs CM Revanth: పాలమూరులో హోరాహోరీ.. ఓ పక్క పీఎం.. మరో పక్క సీఎం!

PM Modi Vs CM Revanth: పాలమూరులో హోరాహోరీ.. ఓ పక్క పీఎం.. మరో పక్క సీఎం!

PM Modi and CM Revanth Meetings in Mahabubnagar: నాలుగోదశ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి రెండ్రోజుల్లో తెరపడనుంది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోటీ ప్రధానంగా కాంగ్రెస్ – బీజేపీల మధ్య కనిపిస్తుంది. బీఆర్ఎస్ కు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎదురైన పరాభవమే మళ్లీ ఎదురవ్వక తప్పదన్న సంకేతాలు ఇప్పటికే వలువడ్డాయి. ఇక కాంగ్రెస్, బీజేపీలు నువ్వా- నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. పోటీపోటీగా ప్రచార సభలు, రోడ్ షో లు నిర్వహిస్తున్నాయి. జాతీయ నేతలంతా తెలంగాణకు క్యూ కట్టి.. సభలు, సమావేశాలు నిర్వహించారు.


ఇక ఎన్నికల ప్రచార పర్వం తుదిదశకు చేరుకుంది. ఈ రెండురోజుల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకే పార్లమెంట్ నియోజకవర్గంలో గంట తేడాతో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు జరగనున్నాయి. మక్తల్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి వస్తుండగా.. జిల్లా కేంద్రంలో జరిగే బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తారు. ఇద్దరి సభల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠ నెలకొంది.

ఎవరి సభకు ఎంత ఎక్కువ మంది వస్తే.. వారి సభ విజయవంతం అయినట్లు. మరి గంట తేడాతో సభలు జరగనుండటంతో.. పీఎం, సీఎం సభల్లో ఎవరి సభకు ప్రజలు ఎక్కువగా వెళ్తారన్నది ఉత్కంఠగా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లాపై పట్టు సాధించేందుకు ఇరుపార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి రెండింటిలో ఏ పార్టీ అభ్యర్థి నెగ్గుతారో చూడాలి. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ, కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా మన్నే శ్రీనివాస్ రెడ్డిలు పోటీలో ఉన్నారు.


Also Read : రూ. 150తో హైదరాబాద్‌కు వచ్చా.. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగా: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గానీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పూర్తిస్థాయిలో అభ్యర్థులను నిలబెట్టాయి.

Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×