BigTV English

Pawan Kalyan Comments on Jagan: ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు.. జగన్, చంద్రబాబు, ఆపై ఫిల్మ్ ఇండస్ట్రీ!

Pawan Kalyan Comments on Jagan: ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు.. జగన్, చంద్రబాబు, ఆపై ఫిల్మ్ ఇండస్ట్రీ!

Pawan Kalyan Comments on CM Jagan: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరు కుంది. ప్రధాన పార్టీ ముఖ్యనేతలు పేపర్లు, టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చేస్తు న్నారు. అధికారంలో ఉన్నవారు పాలన గురించి వివరించగా, విపక్ష నేతలు కూటమిగా ఎందుకు జత కట్టామన్నది చెప్పుకునే ప్రయత్నం చేశారు. గడిచిన ఐదేళ్లలో ఏపీలో జరిగిన దాని గురించి డీటేల్స్‌గా బయటపెట్టారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్.


చంద్రబాబు- తాను కలవడం వెనుక గొప్ప కారణం ఉందన్నారు పవన్‌కల్యాణ్. చంద్రబాబు తనకు బంధువు కాదని, ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది మా ఇద్దరిలో కామన్ పాయింట్‌గా చెప్పుకొచ్చారు. చంద్ర బాబు జైలులో ఉన్నప్పుడు నేరుగా వెళ్లి సంఘీభావం తెలిపానని గుర్తు చేశారు. నలభై ఏళ్లు రాజకీయాల్లో ఉండే వ్యక్తికి ఇలాంటి పరిస్థితి వస్తే.. రేపటి రోజున మన భవిష్యత్తు ఏంటన్నది ప్రతీ ఒక్కరిలోనూ ఉందని, అందుకే తాను జైలుకి వెళ్లి ఆయనను కలిశానని చెప్పుకొచ్చారు జనసేన అధినేత.

పనిలోపనిగా జగన్ వ్యవహారశైలి గురించి కూడా మనసులోని మాట బయటపెట్టారు పవన్. జగన్‌కు అహంకారం ఎక్కువని, ఆయన చెప్పింది అందరూ వినాలనే స్వభావమున్న వ్యక్తని చెప్పారు. ఒకప్పుడు చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, మహేష్‌బాబు వంటి స్టార్ హీరోలంతా సీఎం జగన్‌ను కలిశారు. వీళ్లకు.. సినిమా టికెట్లకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే ప్రభుత్వం.. నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్‌తో మాట్లాడుకోవాలన్నారు. సినిమా హీరోలు వచ్చి టికెట్ల గురించి అడిగితేగానీ జగన్ అహం  తగ్గలేదన్నారు. మరో విషయం ఏంటంటే.. ఈసారి ఎన్నికల్లో మద్దతు కావాలని తాను మా అన్నయ్యనే కాదు పరిశ్రమలో ఏ ఒక్కరినీ అడగలేదన్నారు.


Also Read: Kumari aunty: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కుమారీ ఆంటీ.. ఎవరి తరఫున అంటే..?

2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ గురించి తాను ఊహించినదంతా నిజమైందన్నారు పవన్. వాళ్లు కేవలం హింసనే నమ్ముకున్నారన్నారు. ఇది అత్యంత ప్రమాదకర నేరాలకు దారితీస్తుందనే విషయం అప్పట్లోనే అర్థమైందన్నారు. అక్రమాలతో సంపాదించిన డబ్బుతో రాజకీయాలు చేస్తున్న జగన్, ఎవరు ఎలా బతకాలో, ఎవరు భయపడాలో చెబుతున్నారని, చివరకు అధికారులను సైతం బెదిరిస్తున్నా రని వెల్లడించారు.

టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య పొత్తులకు మధ్యవర్తిని తానేనని వెల్లడించారు జనసేన అధినేత. కొన్ని సందర్భాల్లో బలంగా ఉండాలని అనుకునేవాడినని, కాకపోతే ప్రజల భవిష్యత్తును ఆలోచించానన్నారు. అందుకే సీట్ల విషయంలోనూ తగ్గాల్సి వచ్చిందంటూ మనసులోని మాట బయటపెట్టారు. ముఖ్యంగా చట్టచభలో చంద్రబాబు వైఫ్ ప్రస్తావన తెచ్చి ఆమెను కించపరిచేలా మాట్లాడాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు. ఈ విషయంలో అందుకే తాను స్పందించానని తెలిపారు.

Also Read:  ఏపీలో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. రికార్డు స్థాయిలో పోలింగ్..

సంక్షేమానికి సీఎం జగన్ ఆద్యుడేమీ కాదని, ఆయన కంటే ముందు పథకాలు ఉన్నాయని గుర్తు చేశారు పవన్‌కల్యాణ్. జగన్ మాత్రం తానే సంక్షేమం ఇస్తున్నట్లు గొప్పులు చెప్పకోవడం తగదన్నారు. ఇదేమైనా రాచరికమా అని అన్నారు. ప్రజల కోసం తన సొంత డబ్బుల్లో ఒక్క రూపాయి ఇచ్చే గుణం ఆయనకు లేదన్నారు. అసలు సంపద క్రియేట్ చేయపోతే, సంక్షేమ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఆయన చేసింది కూడా అదేనన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్.

Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×