BigTV English

BRS Office : ఏపీపై కేసీఆర్ ఫోకస్.. గుంటూరులో పార్టీ కార్యాలయం ప్రారంభం..

BRS Office : ఏపీపై కేసీఆర్ ఫోకస్.. గుంటూరులో పార్టీ కార్యాలయం ప్రారంభం..

BRS Office : బీఆర్ఎస్ విస్తరణపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ మరింత ఫోకస్ చేశారు. ఇప్పటికే మహారాష్ట్రలో అనేక సభలు నిర్వహించారు. ఆ రాష్ట్రంలో చాలా మంది నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. ఇటు ఏపీలోనూ పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కార్యకలాపాలు విస్తరించేందుకు బీఆర్‌ఎస్‌ మరో ముందడుగు వేసింది.


గుంటూరులో పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు. మంగళగిరి రోడ్డులోని ఏఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఐదంతస్థుల భవనంలో కాన్ఫరెన్స్‌ హాళ్లు, నాయకులకు ప్రత్యేక చాంబర్లు ఉన్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొంతమంది నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారని తోట చంద్రశేఖర్ కొనియాడారు. దేశంలో బీజేపీని ఎదుర్కోగల వ్యక్తి కేసీఆర్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు టీడీపీ, వైసీపీ పాలనతో విసిగిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో ఆ పార్టీలు కక్షలు, కార్పణ్యాలతో రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఏపీ ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. వైసీపీ, టీడీపీ నేతలకు మోదీని ప్రశ్నించే ధైర్యంలేదని విమర్శించారు. ఏపీలోని పార్టీలు మోదీకి గులాంగిరీ చేస్తున్నాయని ఆరోపించారు. దక్షిణ భారత దేశంలో ప్రధాని కాగల నాయకుడు కేసీఆర్‌ మాత్రమేనని తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు.


ఇటీవల మహారాష్ట్ర నాందేడ్‌లో పార్టీ ఆఫీస్‌ ను కేసీఆర్ ప్రారంభించారు. అదే రోజు పార్టీ కార్యకర్తలకు 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెల రోజుల్లో సభ్యత్వ నమోదును పూర్తి చేయాలన్న ఆదేశించారు. పార్టీ నేతలకు ట్యాబ్‌లు, మెంబర్‌షిప్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఇలా మహారాష్ట్రలో పార్టీ విస్తరణపై కేసీఆర్ సీరియస్ గా ఫోకస్ పెట్టినా ఏపీ విషయంలో మాత్రం ఆచితూచి అడుగు వేస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర నిర్ణయాన్ని కేసీఆర్ తప్పుపట్టారు. కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన టెండర్ల ప్రక్రియలో సింగరేణి సంస్థ తరఫున పాల్గొంటామని హామీ ఇచ్చినా వెనకడుగు వేశారు. ఏపీ అభివృద్ధి కేసీఆర్‌తో మాత్రమే సాధ్యమంటూ అక్కడి నేతలు అంటున్నారు. కానీ రాష్ట్రంలో కారు మాత్రం ముందుకు కదలడంలేదు. ఇకనైనా కేసీఆర్ ఏపీ పొలిటికల్ హైవేపై గేర్ మారుస్తారా..?

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×