BigTV English

Shrinking Seas: ఇంకిపోతున్న సముద్రాలు.. శాస్త్రవేత్తల ఆందోళన..

Shrinking Seas: ఇంకిపోతున్న సముద్రాలు.. శాస్త్రవేత్తల ఆందోళన..

Shrinking Seas: వాతావరణ మార్పులు, కాలుష్యం.. ఈ రెండూ ఎంత విపరీతంగా పెరిగిపోతూ మానవాళిని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ రెండిటి కారణంగా త్వరలోనే ప్రపంచంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. జరిగే నష్టాలను కొంతమేరకు అయినా తగ్గించడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిస్థాయిలో సక్సెస్ అవ్వడం లేదు. ఇక త్వరలోనే ప్రపంచంలో జరిగే అతిపెద్ద నష్టం గురించి వారు బయటపెట్టారు.


1990 తర్వాత వాతావరణంలో, గాలిలో వస్తున్న మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద సముద్రాలు, రిజర్వాయర్లు ఇంకిపోవడం మొదలయ్యింది. ఇవన్నీ ఎక్కువశాతం వాతావరణంలో వస్తున్న మార్పుల వల్లే జరుగుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇలా ఇంకిపోవడం మొదలయిన తర్వాత వ్యవసాయానికి తగిన నీరు ఎలా అని అందరిలో ఆందోళన మొదలయ్యింది. కేవలం వ్యవసాయం కోసమే కాదు.. మరెన్నో అవసరాలకు కూడా నీరు ఎలా సరిపోతుంది అని శాస్త్రవేత్తల్లో సైతం ఆలోచన కలిగింది.

ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్లు అయిన యూరోప్‌లోని కాస్పియన్ సీ నుండి సౌత్ అమెరికా నుండి ఏసియాలోని టిటికాకా.. గత మూడు దశాబ్దాల్లో 22 గిగాటన్నుల నీటిని కోల్పోయాయని తేలింది. ఇది అమెరికాలో ఉన్న అదిపెద్ద రిజర్వాయర్ అయిన లేక్ మేడ్‌లో ఉన్న నీటికంటే 17 శాతం ఎక్కువ. దీంతో ఈ విషయంపై పలువురు హైడ్రాలజిస్ట్స్ స్టడీ చేయడం మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఇంకిపోతున్న సముద్రాల్లో 56 శాతం వాతావరణం వేడెక్కడం వల్లే జరుగుతున్నాయని తేల్చారు. దాంతోపాటు మనుషులు అవసరాలు కూడా పెరగడం వల్లే నీటికొరత మొదలయిందని అన్నారు.


ఇప్పటివరకు క్లైమెట్ సైంటిస్టులు చేసిన పరిశోధనల ప్రకారం వాతావరణం వేడెక్కుతున్న సమయంలో తడి ప్రాంతాలు మరింత తడిగా, వెచ్చగా ఉన్న ప్రాంతాలు మరింత ఎండిపోయినట్టుగా అవుతాయని నిర్ధారించారు. కానీ గత కొన్నేళ్లుగా తడిగా ఉన్న ప్రాంతాల్లోని సముద్రాలు కూడా ఇంకిపోవడం మొదలయ్యింది. అందుకే దీనిని సీరియస్ సమస్యగా పరిగణించాలని వారు నిర్ణయించుకున్నారు. శాస్త్రవేత్తలు.. శాటిలైట్ల సాయం తీసుకొని దాదాపు 2000 పెద్ద చెరువులను ప్రత్యేకంగా స్టడీ చేశారు.

1992 నుండి 2020 మధ్యలో చెరువులు దాదాపు 53 శాతం ఇంకిపోయాయని వారు చేసిన పరిశోధనల్లో తేలింది. అంతే కాకుండా ఇవన్నీ వర్షపాతం తగ్గిపోవడం, వాతావరణంలో మార్పులు, మనుషులు ఎక్కువగా నీటిని వినియోగించడం వంటి కారణాల వల్లే జరిగాయని తెలిసింది. గత కొన్నేళ్లలో దాదాపు 2 బిలియన్ మంది నీటికొరత సమస్యతో బాధపడుతున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా చెరువులు, సముద్రాలు ఇంకిపోతున్న సమస్యను సీరియస్‌గా పరిగణించాలని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. అందుకే దీనికి తగిన చర్యలు కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Related News

Actor Suhas: మరో బిడ్డకు తండ్రి అయిన నటుడు సుహాస్.. ఫోటో వైరల్!

Bigg Boss 9 Telugu: డబుల్‌ ఎలిమినేషన్‌ కాదు.. సింగిలే, మూడో వారం కామనర్‌ అవుట్‌!

Gautami Chowdary: గౌతమ్‌ చౌదరికి అంబర్‌పెట్‌ శంకర్‌ మద్దతు.. లైవ్‌లో అసలు నిజం బట్టబయలు..

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Big Stories

×