BigTV English

Chandrababu Bail Petition : చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా.. సీఐడీకి హైకోర్టు ఆదేశాలు

Chandrababu Bail Petition : చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా.. సీఐడీకి హైకోర్టు ఆదేశాలు

Chandrababu Bail Petition : చంద్రబాబు బెయిల్ పిటిషన్ల పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన ఏపీ హై కోర్టును ఆశ్రయించారు.ఏసీబీ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ..హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. కేవలం రాజకీయ ప్రతీకార చర్యతోనే తనను ఇరికించారని చంద్రబాబు పిటిషన్లో తెలిపారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. చంద్రబాబు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.


ఇక అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో కూడా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటు ..ఫైబర్ నెట్ కేసులో దాఖలైన పీటి వారెంట్ పై నేడు ఏసీబీ కోర్టు తీర్పును చెప్పనుంది. ఫైబర్ నెట్ స్కాంలో పీటి వారెంట్ విచారణ సందర్భంగా.. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును కోర్టులో హాజరు పరచాలని సీఐడీ తరపు న్యాయవాది కోరారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో నిన్న పీటి వారెంట్ పై వాదనలు ముగిశాయి. దీనిపై నేడు ఏసీబీ కోర్టు తీర్పును వెలవరించనుంది.


Tags

Related News

Amaravati News: వైసీసీ గుట్టు బయటపెట్టిన మంత్రి లోకేష్, ఖర్చు మామూలుగా లేదు, రంగంలోకి సిట్

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Big Stories

×