E-Paper
Advertisement

సీఐ కాపునే, బాధితుడు కాపు కులస్తుడే.. పవన్‌పై నోరుపారేసుకుంటే సహించం: సీఎం

సీఐ కాపునే, బాధితుడు కాపు కులస్తుడే.. పవన్‌పై నోరుపారేసుకుంటే సహించం: సీఎం
Advertisement

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి సరికొత్త వెలుగులు వచ్చాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జొన్నగిరి గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్టాత్మక బంగారం శుద్ధి కర్మాగారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్లాంట్ ప్రారంభంతో ఏపీ ఖనిజ సంపద రంగంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైనట్లయింది.

రెండో యూనిట్‌కు శంకుస్థాపన.. ప్రాసెసింగ్ పరిశీలన

Advertisement

కేవలం ప్లాంట్‌ను ప్రారంభించడమే కాకుండా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాంటు విస్తరణ పనులకు కూడా సీఎం శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రెండో యూనిట్‌ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం, ప్లాంటు లోపలికి వెళ్లి అక్కడ జరుగుతున్న గోల్డ్ ప్రాసెసింగ్ విధానాన్ని ముఖ్యమంత్రి స్వయంగా దగ్గరుండి పరిశీలించారు. ఈ ప్లాంట్ ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.

విజయవాడ సాయికృష్ణ కేసుపై ఘాటు స్పందన

Advertisement

అశోకుడి నాల్గవ రాజధాని అయిన నాటి ‘స్వర్ణగిరి’ని నేడు మనం ‘జొన్నగిరి’గా పిలుచుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. వందల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతం బంగారం, రత్నాలతో నిండి ఉండేదని, ఇక్కడ లభించిన అశోకుడి ఎర్రగుడి శాసనాలే అందుకు ప్రత్యక్ష నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో, ఇప్పుడున్న జొన్నగిరి పేరునే ఉంచుకుందామా? లేక పూర్వ వైభవాన్ని గుర్తుచేసేలా మళ్లీ పాత పేరు అయిన ‘స్వర్ణగిరి’గా మార్చుకుందామా? అని సీఎం చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు.

జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు రాజకీయ, శాంతిభద్రతల అంశాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల సంచలనం సృష్టించిన విజయవాడ సాయికృష్ణ కేసు గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కేసులో కొందరు కావాలనే కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సదరు సీఐ కాపు సామాజికవర్గానికి చెందినవారేనని, బాధితుడు కూడా కాపు కులస్తుడేనని స్పష్టం చేశారు. కానీ, దీనికి కూడా కొందరు రాజకీయ రంగు పులిమి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విపక్షాలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక

రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూస్తున్న శక్తులకు సీఎం చంద్రబాబు ఈ సభ వేదికగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అనవసరంగా నోరు పారేసుకుంటే సహించేది లేదని, అలా ప్రవర్తించే వారి నోర్లు మూయించే శక్తి ఎన్డీయే ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. ‘గొడ్డలి పార్టీ’ రాత్రింబవళ్లు కుట్రలు పన్నుతోందని, రాష్ట్రాన్ని కులం, మతం, ప్రాంతం, వర్గాల వారీగా విడదీస్తూ రోజూ విషాన్ని చిమ్ముతోందని విపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ, సమాజంలో చీలికలు తెచ్చే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు.

రాయలసీమే భవిష్యత్ ఇండస్ట్రియల్ హబ్

బెంగళూరు నుండి పుట్టపర్తి వరకు ఉన్న ప్రాంతాన్ని ఒక భారీ డిఫెన్స్ కారిడార్‌గా మార్చబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దేశంలో విమానాలు తయారు చేయడానికి పెద్దగా అవకాశాలు లేకపోయినా, భవిష్యత్తులో రాయలసీమలోనే విమానాలను తయారు చేసే పరిస్థితిని తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Also Read: కోల్‌కతాలో కూలిన పాత గోదాం.. శిథిలాల కింద 30 మంది కార్మికులు!

Related News

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు

గోదావరి నీళ్లు నల్లమల సాగర్‌కు రావాలి.. మాట ఇచ్చాను, ప్రాజెక్టు పూర్తి చేశాం-సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×