E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

సీయూఈటీ-యూజీ ప్రవేశ ఫలితాలు.. జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఎమ్మెల్యే కూతురు దేవినా

సీయూఈటీ-యూజీ ప్రవేశ ఫలితాలు.. జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఎమ్మెల్యే కూతురు దేవినా
Advertisement

CUET UG Results 2026:  దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థల్లో యూజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి ఫలితాల్లో ఎమ్మెల్యే కూతురు దేవినా జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు దక్కించుకుంది. వెల్లడైన ఫలితాల్లో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది ఆమె. తొలి స్థానం రావడంపై ఆశ్చర్యానికి గురైంది.

సీయూఈటీ-యూజీ 2026 ప్రవేశ ఫలితాలు విడుదల

Advertisement

కోర్సు ఏదైనా ప్రవేశ పరీక్షలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించాలని ప్రతీ విద్యార్థి కోరుకుంటారు. ఆ కల కొందరికి మాత్రమే నెరవేరుతుంది. ఇంకొందరికి కలగానే మిగిలిపోతుంది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-CUET UG-2026 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. మే 11 నుంచి 31 మధ్య దీనికి సంబంధించి పరీక్షలు జరిగాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA ప్రకటించిన ఫలితాల ప్రకారం.. దేవీనా 1250 మార్కులకు గాను 1232.19 స్కోరు సాధించి ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచింది.

CUET UG పరీక్షకు ఐదు సబ్జెక్టులకు హాజరైంది దేవినా. వాటన్నింటిలో అసాధారణమైన ప్రతిభను కనబరిచింది. ఇంగ్లీషులో 99.99 పర్సంటైల్ సాధించింది. ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ సబ్జెక్టుల్లో 100 పర్సంటైల్ సాధించింది. ఫైన్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్ , కమర్షియల్ ఆర్ట్స్‌లో ఆమె 99.91 పర్సంటైల్ స్కోరు సాధించింది. మూడు సబ్జెక్టుల్లో 100 పర్సంటైల్ సాధించింది. దీని ద్వారా హాజరైన 11 లక్షల విద్యార్థుల్లో ఆమె ప్రత్యేకంగా నిలిచింది.

Advertisement

ఫస్ట్ ర్యాంక్ సాధించిన బీజేపీ ఎమ్మెల్యే కూతురు దేవినా

సబ్జెక్టుల వారీగా సాధించిన స్కోర్లు అదే విధంగా ఉంది. ఇంగ్లీషులో 241.95 మార్కులు, ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్‌లో 249.53, ఫైన్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్-కమర్షియల్ ఆర్ట్స్‌లో 241.11, పొలిటికల్ సైన్స్‌లో 249.58 మార్కులు సాధించింది దేవినా. సైకాలజీలో 250 మార్కుల స్కోరు సాధించింది. వచ్చిన స్కోర్ అంతా కలిపితే మొత్తం 1232.19 మార్కులు వచ్చాయి. దీని ద్వారా ఆమె CUET UG-2026 ఫలితాల్లో అత్యధిక స్కోరర్‌గా నిలిచింది.

జాతీయ స్థాయిలో తొలి ర్యాంకు సాధించిన దేవినా ఆనందం వ్యక్తం చేసింది. ఫలితాల తర్వాత తన మనసులోకి వచ్చింది తల్లిదండ్రులేనని చెప్పింది. తన విద్యా ప్రయాణంలో అండగా నిలిచారని, ఈ విజయం తనతో పాటు తన కుటుంబానికి దక్కుతుందని తెలిపింది. జర్నలిజంపై ఆసక్తి ఉందని, తండ్రి చేస్తోన్న సేవను చూసి రాజకీయాలపైనా ఇష్టం ఏర్పడిందని తెలిపింది.

ALSO READ: విద్యార్థులకు శుభవార్త.. జూన్ 30 లోపు ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు

బీజేపీ ఎమ్మెల్యే కైలాశ్ గహ్లోత్‌ కూతురు దేవినా. కైలాశ్ గతంలో ఢిల్లీ రవాణా-పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల ముందు ఆప్ నుంచి బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. వసంత్ కుంజ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని అయిన దేవినా, చదువులో నిలకడగా రాణిస్తోంది. 12వ తరగతి బోర్డు పరీక్షలలో 99.2 శాతం మార్కులు సాధించింది. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Related News

విద్యార్థులకు గుడ్ న్యూస్.. జూన్ 30లోపు ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 538 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

నీట్ రీ-టెస్ట్‌లో ఆసక్తికర విషయాలు.. మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లు, 24 మంది అరెస్ట్

సీబీఎస్ఈ 12వ తరగతి.. రీ-వాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఏపీ వైద్య శాఖలో..529 స్టాఫ్ నర్స్,ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివిగో !

దేశవ్యాప్తంగా నీట్ రీఎగ్జామ్.. సెంటర్లలో పటిష్ట బందోబస్తు, ప్రశ్నాపత్రాలు విమానాల్లో తరలింపు

Big Stories

×