E-Paper
Advertisement

తల్లికి వందనం పథకం.. నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు క్లారిటీ, ఒక్కసారి చెక్ చేసుకోండి

తల్లికి వందనం పథకం.. నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు క్లారిటీ, ఒక్కసారి చెక్ చేసుకోండి
Advertisement

Thalliki Vandanam Scheme: ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మకమైన పథకాల్లో ‘తల్లికి వందనం’ ఒకటి. ఈ పథకం నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. జూలైలో ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కర్నూలు జిల్లాలో పర్యటన భాగంగా తల్లికి వందనం నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చారు.

ఎట్టకేలకు తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై క్లారిటీ 

Advertisement

విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో తల్లికి వందనం ఒకటి. దీని ద్వారా పేద-మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందజేస్తూ విద్యాభ్యాసాన్ని ప్రోత్సహిస్తోంది. పాఠశాలలు ప్రారంభించి దాదాపు 10 రోజులు గడుస్తున్నా, ఈ పథకం నిధుల విడుదలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు.

దీంతో నిధులు ఎప్పుడంటూ చర్చించుకోవడం విద్యార్థుల తల్లిదండ్రుల వంతైంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. వచ్చే నెలలో తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని ప్రకటనించారు సీఎం చంద్రబాబు.

Advertisement

జూలై‌లో నిధులు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన

బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటించిన సీఎం, జొన్నగిరి గోల్డ్ మైన్స్‌లో రెండో యూనిట్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. తల్లికి వందనం నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చారు. అయితే నిధులు ఎప్పుడు ఇస్తారనే దానిపై తర్జనభర్జన జరుగుతోంది.

అధికారులు మాత్రం జూలై థర్డ్ వీక్ పడే అవకాశముందని చెబుతున్నారు. తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వ-ప్రైవేట్ పాఠశాలల వెళ్లే ప్రతీ విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రూ.15 వేలులో రెండువేలు పాఠశాల నిర్వహణ కోసం కేటాయించనున్నారు. మిగతా రూ.13 వేలు అర్హులైన విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేస్తున్నారు.

ALSO READ: సాయికృష్ణ కేసులో కీలక విషయాలు.. పోలీసు కస్టడీలో మృతి, మృతదేహం మాటేంటి?

గతేడాది నుంచి ఈ పథకం అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం, ఈ ఏడాది నిధుల విడుదలకు సిద్ధమైంది. గతేడాది 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం డబ్బులు ఇచ్చింది ప్రభుత్వం. తల్లికి వందనం కింద నిధులు పొందేందుకు తల్లిదండ్రులు కొన్ని విషయాలను తప్పకుండా పాటించాలి. తొలుత విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో అనుసంధానం అయ్యిందా? లేదా అనేది పరిశీలించుకోవాలి.

తల్లి బ్యాంక్ అకౌంట్‌కు ఎన్‌పీసీఐ లింక్ అనేది తప్పనిసరి. ఈ విషయాన్నిపరిశీలించాలని అధికారులు చెబుతున్నారు. ఈ స్కీమ్ అర్హుల జాబితాను రూపొందిస్తున్న అధికారులు.. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఆఫీసుల్లో వాటిని ప్రదర్శించనున్నారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే అవకాశం ఇస్తారు. అర్హులైన వారి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు.

 

 

Related News

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

Big Stories

Advertisement
×