Kolkata: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పాత గోదాం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో సుమారు 30 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో లోడింగ్, అన్‌లోడింగ్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఘటన జరిగిన వెంటనే స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు (NDRF), అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. భారీ యంత్రాల సహాయంతో కాంక్రీట్ పలకలను, ఇనుప రాడ్లను తొలగిస్తూ శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు.
ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం.. శిథిలాల నుంచి కొందరిని సురక్షితంగా బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్టు సమాచారం. గోదాం భవనం బాగా పాతది కావడం, సరైన నిర్వహణ లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ఆందోళనతో ఘటనాస్థలికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంపై అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు.
Also Read: ఏసీ బాక్స్‌కు దుమ్ముపట్టిందా? నేరుగా నీళ్లతో కడగొచ్చా? లేదా? షాకింగ్ నిజాలు!