E-Paper
Advertisement

సాయికృష్ణ అదృశ్యం కేసు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన సీఐ నాగరాజు, న్యాయస్థానం ముందుకు

సాయికృష్ణ అదృశ్యం కేసు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన సీఐ నాగరాజు, న్యాయస్థానం ముందుకు
Advertisement

Vijayawada: విజయవాడలో సాయికృష్ణ అదృశ్యం కేసులో ఏం జరుగుతోంది? మాజీ సీఐ నాగరాజును దాదాపు 8 గంటల పాటు సిట్ విచారించిందా? విచారణలో నాగరాజు ఎలాంటి విషయాలు బయటపెట్టారు? సిట్ ఐజీ విచారించినా నాగరాజు నోరువిప్పలేదా?  నాగరాజు సైలెంట్‌పై ఖాకీ వర్గాల్లో కలకలం రేపుతోంది?

సాయికృష్ణ అదృశ్యం కేసు.. ముగిసిన సిట్ విచారణ

Advertisement

సాయికృష్ణ అదృశ్యం కేసులో విచారణ ముమ్మరం చేసింది సిట్. మంగళవారం సస్పెండ్ సీఐ నాగరాజుని అరెస్టు చేసిన సిట్ అధికారులు,  మధ్యాహ్నం నుంచి పలు దఫాలుగా ఆయన్ని విచారించారు. తొలుత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒకసారి విచారణ చేపట్టారు. మళ్లీ రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు విచారించారు. బుధవారం ఉదయం మరోసారి నాగరాజుని విచారించారు.

సిట్ అధికారులు నాగరాజుకు కేవలం 8 ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఐజీ రవిప్రకాష్‌తోపాటు మిగతా ఎస్పీలు అస్మి, అమిత్‌ బర్దర్‌ నేరుగా ప్రశ్నించారు. వ్యక్తిగత, ఇతర విషయాల గురించి చెప్పిన నాగరాజు, సాయికృష్ణ విషయంలో నోరు విప్పలేదని తెలుస్తోంది.

Advertisement

షాకింగ్ నిజాలు బయటకు.. న్యాయస్థానం ముందుకు నాగరాజు

సాయికృష్ణను మార్కాపురం నుంచి ఎందుకు తీసుకొచ్చారన్న దానిపై పలు విధాలుగా సిట్ అధికారులు ప్రశ్నలు సంధించినా నాగరాజు మాత్రం నోరు విప్పలేదని తెలుస్తోంది. నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ కేసులో సాయికృష్ణను కోర్టులో హాజరుపర్చకుండా ఏం చేశారంటూ ప్రశ్నలు సంధించారు.

తనకు తెలీదని తప్పించుకునే ప్రయత్నం చేశారట సీఐ నాగరాజు. స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీ ఏమైంది? డిలీట్‌ చేసిన విషయం మీకు తెలుసా? లాకప్‌లో కొట్టడం వల్ల సాయికృష్ణ చనిపోయాడా? మరణిస్తే ఆయన డెడ్‌బాడీ ఎక్కడంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. పై అడిగిన ప్రశ్నలకు నాగరాజు నోరువిప్పలేదని తెలుస్తోంది.

ALSO READ: రాయలసీమలో బంగారం అమ్మకం, జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టులో మరో యూనిట్‌

సాయికృష్ణ తల్లి ప్రధాన ఆరోపణ చేశారు. మా కొడుకుని లాకప్‌లో కొట్టడం వల్లే చనిపోయాడని పేర్కొన్నారు. ఆ కోణంలో ప్రశ్నలు సంధించినా నాగరాజు నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదని సమాచారం. నాగరాజు విచారణ పూర్తి కావడంతో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కోర్టులో ఆయన్ని హాజరుపర్చనున్నారు సిట్ అధికారులు.

విచారణ సందర్భంగా సిట్ సేకరించిన ఆధారాలు న్యాయస్థానం ముందు ఉంచనుంది. కేసు తీవ్రత, లభించిన ఆధారాల మేరకు న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరోవైపు నాగరాజు అరెస్ట్‌పై విజయవాడలో స్థానికులు ఆందోళనకు దిగారు.  విధులు సరిగా నిర్వహించివారిని విచారిస్తే.. న్యాయం ఇంకెవరికి జరుగుతుందంటూ నినాదాలు చేస్తున్నారు.  సీఐ నాగరాజు వల్ల గంజాయి వ్యవహారం తగ్గుముఖం పట్టిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

 

Related News

జగన్ పర్యటనలో ఎస్సైపై దాడిచేసిన.. చింతాడ రవి అరెస్ట్!

మెగా డీఎస్సీ కాదు.. అదొక ‘దగా డీఎస్సీ’.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రోజా!

2029 లో మీరు జీరో అవ్వడం పక్కా.. వైసీపీ పార్టీ పై మంత్రి నారాయణ షాకింగ్ కామెంట్స్!

తిరుపతి సోనోవిజన్‌ షాప్‌లో భారీ చోరీ.. 50 ఐఫోన్లు, 100 స్మార్ట్‌ఫోన్లు గాయబ్!

జగన్ అడుగేస్తే విధ్వంసం.. నోరు విప్పితే అబద్ధాలు: మంత్రి సవిత

టీడీపీ ఆదేశంతో చలసాని బిగ్ డెసిషన్.. కృష్ణా డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనామా!

విజయా డైరీపై లోకేష్ కుట్రలు.. బెదిరించి చైర్మన్‌తో రాజీనామా చేయించారు!- పేర్ని నాని

ఏపీలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల భారీ బదిలీలు.. ఏ అధికారికి ఏ పోస్టింగ్?

Big Stories

Advertisement
×