E-Paper
Advertisement

ధర్మవరం సభలో పూనకాలు.. పవన్ పాటకు మంత్రి సత్యకుమార్ యాదవ్ మాస్ స్టెప్పులు!

ధర్మవరం సభలో పూనకాలు.. పవన్ పాటకు మంత్రి సత్యకుమార్ యాదవ్ మాస్ స్టెప్పులు!
Advertisement

Satya Kumar Yadav: రాజకీయ నాయకులు ఎప్పుడూ సీరియస్‌గా.. ప్రజా సమస్యలపై చర్చిస్తూ కనిపిస్తుంటారు. కానీ, అప్పుడప్పుడు వారు కూడా తమలోని కళాకారుడిని బయటకు తీసి అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సరిగ్గా ఇదే పని చేశారు. ఒక బహిరంగ సభలో ఆయన వేసిన మాస్ స్టెప్పులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ధర్మవరంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సభలో వాతావరణం అంతా పండగలా సాగుతున్న సమయంలో.. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన ‘జానీ’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘నారాజు గాకురా మా అన్నయ్య’ పాట ప్లే అయ్యింది.

Advertisement

Also Read: హైకోర్టు ఎంట్రీతో సీన్ రివర్స్.. సాయికృష్ణ కేసులో సిట్ రిమాండ్ రిపోర్టులో వణికించే నిజాలు!

ఆ పాట వినడమే ఆలస్యం.. మంత్రి సత్యకుమార్ యాదవ్ స్టేజ్ పైనే మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. పవన్ కల్యాణ్ సిగ్నేచర్ మూమెంట్స్‌ను అనుకరిస్తూ ఆయన జోష్‌గా డ్యాన్స్ చేయడంతో సభాప్రాంగణం అంతా ఒక్కసారిగా ఊగిపోయింది. అక్కడున్న వారంతా కేరింతలు, చప్పట్లతో మంత్రిని మరింత ఉత్సాహపరిచారు. ఎప్పుడూ సౌమ్యంగా, హుందాగా కనిపించే మంత్రిలో ఈ ఊరమాస్ యాంగిల్ చూసి సొంత పార్టీ కార్యకర్తలతో పాటు పవన్ కల్యాణ్ అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Advertisement

Related News

అన్నమయ్య జిల్లాలో విషాదం.. తల్లిని చంపిన తండ్రి.. మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య!

ఉరికొయ్యకు వేలాడిన తల్లి.. ఆ పాదాల చెంతే కన్నీటి పర్యంతమైన పసిగుండె!

విజయనగరం జిల్లాలో బొత్స ఆధిపత్యానికి మేనల్లుడు గండి.. చక్రం తిప్పనున్న మేనల్లుడు చిన్న శ్రీను

జగన్ దారిలో వైసీపీ నేతలు.. చెవిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. మరో ఆరునెలల్లో ఎన్నికలు-తడాఖా చూపిస్తాం

పరిషత్ ఎన్నికల్లో దేవుడి స్క్రిప్ట్ రిపీట్.. 17 జిల్లాల్లో వైసీపీ ఎన్నిసీట్లు అంటే.. ఆ 11 జిల్లాలు మాత్రమే

కంచుకోటలు కూలినా వైసీపీ పరువు కాపాడిన అల్లూరి జిల్లా.. జెడ్పీ పీఠంపై ఫ్యాన్ పార్టీ, కూటమిని దెబ్బ కొట్టిన

స్థానిక ఎన్నికల్లో తండ్రీ-కొడుకులకు భయం.. ఆ భయం నన్ను వెంటాడుతోంది-అంబటి, ‘బిగ్‌టీవీ స్ట్రెయిట్ టాక్‌’లో..

పరిషత్ ఎన్నికల ఫలితాలపై జగన్ రియాక్ట్.. ప్రజల మనసులు గెలుచుకున్నాం

Big Stories

Advertisement
×