E-Paper
Advertisement

Delhi Andhra Meals: ఆహా ఏమి రుచి.. ఆంధ్రా భోజనానికి జపాన్ దౌత్య సిబ్బంది ఫిదా, సీఎం చంద్రబాబు స్పందన

Delhi Andhra Meals: ఆహా ఏమి రుచి.. ఆంధ్రా భోజనానికి జపాన్ దౌత్య సిబ్బంది ఫిదా, సీఎం చంద్రబాబు  స్పందన
Advertisement

Delhi Andhra Meals: తెలుగు వంటకాల రుచికి ఫిదా అయిపోయారు జపాన్ దౌత్యవేత్తలు. ఆంధ్ర రుచులను ఆస్వాదిస్తూ వారు చేసిన విందు భోజనం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఘాటైన మసాలాలు, నోరూరించే ఆవకాయ-పప్పు వాటితో ఆంధ్రా థాలీ చూసి ఆశ్చర్యపోయారు. వాటి రుచులను అమితంగా ఇష్టపడ్డారు. వాటికి సంబంధించి ఫోటోలను ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు.

ఆంధ్రా భోజనానికి జపాన్ దౌత్య సిబ్బంది ఫిదా

Advertisement

ఆంధ్రా వంటకాల వాసన చూస్తే చాలు ఎప్పుడెప్పుడు భోజనం చేద్దామా అనిపిస్తుంది. పొరుగు ప్రాంతాలకు వెళ్లినప్పుడు కేవలం ఆంధ్రా భోజనం హోటల్‌కి మాత్రమే వెళ్తుంటారు తెలుగు ప్రజలు. ఆ వంటకాలు రుచికి జపాన్ దౌత్యవేత్తలు ఫిదా అయిపోయారు. మంగళవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌కి జపాన్ ఎంబసీ సభ్యులు వెళ్లారు.

నోరూరించే ఆంధ్ర రుచులను ఆస్వాదిస్తూ వారు చేసిన భోజనం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఘాటైన మసాలాలు, నోరూరించే పులిహోర, ఆవకాయ, పప్పు, పకోడి, గోంగూర పచ్చడి, గుత్తి వంకాయ కూర, సాంబార్‌లతో నిండిన థాలీ‌ని చూసి ఆశ్చర్యపోయారు. ఆయా రుచులను అమితంగా ఇష్టపడ్డారు కూడా.

Advertisement

జపాన్ దౌత్య సిబ్బంది కామెంట్స్ సీఎం చంద్రబాబు రియాక్ట్

వాటికి సంబంధించిన ఫోటోలు తీసి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు జపాన్ ఎంబసీ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మా టీమ్ లంచ్ చేశామని, రుచికరమైన ఆంధ్రా థాలీని ఆస్వాదించామని రాసుకొచ్చారు. ఘాటైన రుచులు, మసాలాలతో నిండి ఉందని రాసుకొచ్చారు. జపాన్ ఎంబసీ సభ్యుల పోస్టుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఎంబసీ సభ్యులను ఏపీకి సాదరంగా ఆహ్వానించారు.

జపాన్ ఎంబసీ సభ్యులు చేసిన పోస్ట్‌పై సీఎం చంద్రబాబు స్పందించారు. దీనిపై హర్షం వ్యక్తం చేశారు.నిజంగా హృదయానికి హత్తుకునే విషయమని రాసుకొచ్చారు. ఏపీ భవన్‌లో మా సాంప్రదాయ ఆహారాన్ని ఆస్వాదించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ALSO READ:  వైసీపీకి కోలుకోని దెబ్బ.. సైకిల్ ఎక్కేసిన ఆ గ్రామస్తులు

జపాన్ వంటకాలు సుషీ, సాషిమి ఎలాగైతే కచ్చితత్వం మరియు సమతుల్యత ప్రతిబింబించినట్టుగానే ఆంధ్రా వంటకాలు కూడా తమ రుచుల ద్వారా ప్రతిబింబిస్తాయి. మీ కోసం, జపాన్ నుంచి మా రాష్ట్రానికి వచ్చే అతిధుల కోసం ఇంకా చాలా రుచులు ఉన్నాయన్నారు. మీ అందరికీ రెండో ఇల్లు ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతించడానికి తాము ఎదురుచూస్తున్నామని రాసుకొచ్చారు.

 

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×