Big shock for YCP: కడప జిల్లా జమ్మలముడుగు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అధికార వైసీపీకి గట్టి షాక్ ఇస్తూ ఉప్పలపాడు గ్రామంలో పెద్ద ఎత్తున టీడీపీ చేరికలు జరిగాయి. గ్రామ రాజకీయాల్లో కీలకమైన ఈ పరిణామం స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
ఉప్పలపాడు గ్రామానికి చెందిన దాదాపు 300 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. గ్రామంలో ఇప్పటివరకు వైసీపీకి బలమైన పట్టున్న ప్రాంతంగా గుర్తింపు ఉన్న ఉప్పలపాడులో ఈ స్థాయి చేరికలు జరగడం రాజకీయంగా విశేషంగా మారింది. గ్రామ ప్రజలు టీడీపీ విధానాలు, నాయకత్వంపై విశ్వాసం ఉంచుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ చేరికల కార్యక్రమానికి మంత్రి సవిత హాజరై నూతనంగా పార్టీలోకి వచ్చిన వారిని ఆహ్వానించారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ పాలన తిరిగా రావడం ఖాయమని, ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం పేరుతో వైసీపీ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ఉప్పలపాడు మాజీ HCL చైర్మన్ శ్రీనివాసుల రెడ్డి టీడపీలో చేరడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయనతో పాటు ఆయన అనుచరులు, గ్రామంలోని కీలక కుటుంబాలు టీడీపీ గూటికి చేరడం పార్టీకి మరింత బలాన్ని ఇచ్చింది. శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని.. గ్రామాభివృద్ధే తన లక్ష్యమని తెలిపారు.
జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి గ్రామంలో 90 శాతం కుటుంబాలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ బలం రోజురోజుకూ పెరుగుతోందని.. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు తప్పవని ధీమా వ్యక్తం చేశారు. ఈ పరిణామం జమ్మలమడుగు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలుకుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: చెట్లు సాకు మాత్రమే.. అసలు గురి రంగు రాళ్లపైనే? పెద్దమదిన ఘర్షణ వెనుక అసలు కథ ఇదే?