E-Paper
Advertisement

గోదావరి నీళ్లు నల్లమల సాగర్‌కు రావాలి.. మాట ఇచ్చాను, ప్రాజెక్టు పూర్తి చేశాం-సీఎం చంద్రబాబు

గోదావరి నీళ్లు నల్లమల సాగర్‌కు రావాలి.. మాట ఇచ్చాను, ప్రాజెక్టు పూర్తి చేశాం-సీఎం చంద్రబాబు
Advertisement

Markapuram: వెలిగొండ బంగారు కొండ అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. కరువు నేతలపై కృష్ణమ్మ రాసిన కొత్త చరిత్ర అని అన్నారు. ఆనాడు మాట ఇచ్చామని, నిలబెట్టుకున్నామని అన్నారు. అనుకున్నట్లుగా ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు. ఆనాడు చేసిన సంకల్పం నేడు నల్లమల సాగర్ జలసిరిగా మారిందన్నారు. 2019లో రాష్ట్రంలో గొడ్డలిపార్టీ రాకతో వెలిగొండ ప్రాజెక్టుకు గ్రహణం పట్టిందన్నారు.

 

వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్‌-1 సీఎం చంద్రబాబు ప్రారంభోత్సం

Advertisement

మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో ఆ గ్రహణం వీడిందన్నారు. గత ప్రభుత్వంలో కేవలం 2.7 శాతం పనులు చేశారని, విలువైన కాలాన్ని గాలికి వదిలేశారన్నారు. నిర్వాసితుల కోసం జీవో ఇచ్చారని, అరకొర చెల్లింపులు చేసి మోసం చేశారన్నారు. నిర్మాణం పనులు చేయకుండా ఎన్నికలకు ఒక్క నెల ముందు వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేశామంటూ డ్రామాలు ఆడారని ఎద్దేవా చేశారు.

వైసీపీ చేసిన.. చేస్తున్న ప్రచారాన్ని తప్పుపట్టారు ముఖ్యమంత్రి. రెండు సొరంగాలు తిరిగొచ్చిన వ్యక్తి, ఆనాడు ఎందుకు ప్రాజెక్టు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. సొరంగం మధ్యలో బోరింగ్ మిషన్ ఇరుక్కుపోయిందని, నష్టపరిహారం ఇవ్వాలని వాళ్లు కోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. ఈ విషయంలో స్వయంగా తాను రంగంలోకి దిగి దాన్ని రిపేర్ చేయించి పనులు చేయిస్తే, ఇప్పుడు అంతా చేశామని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.

Advertisement

 

మాట ఇచ్చాను, ప్రాజెక్టు పూర్తి చేశాం-సీఎం చంద్రబాబు

ఈ ప్రాజెక్టు తాను మొదలుపెట్టిన తర్వాత వైఆర్ఎస్, జగన్ కలిసి 11 ఏళ్లు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా ఉన్నారని, అందుకు వాళ్లు ఖర్చుపెట్టింది కేవలం రూ. 2175 కోట్లు ఖర్చు చేశారన్నారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ. 3256 ఖర్చు చేశామని, ఇంకో 1906 కోట్లు ఖర్చు చేయాల్సి వుందన్నారు. ఓవరాల్‌గా పరిశీలిస్తే 50 శాతం పైగానే టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.

మా ప్రభుత్వం కమిట్మెంట్ ఇదేనని కుండబద్దలు కొట్టేశారు. సోమవారం వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దోర్నాల మండలం గంటావానిపల్లి వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ వద్ద కృష్ణమ్మకి జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత సారె సమర్పించి ప్రాజెక్టు తొలిదశను జాతికి అంకితం చేశారు.

 

వైసీపీపై తీవ్రస్థాయిలో విసుర్లు,  సినిమా సెట్టింగులు, ఫేక్ ప్రచారాలు

పోలవరం రాష్ట్రానికి ఓ జీవనాడి అని వచ్చేఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. గోదావరి పుష్కరాలకంటే పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం చేసే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వానిదని అన్నారు. 2028లో కృష్ణా పుష్కరాలు వస్తున్నాయని, మార్కాపురంలో దాన్ని జరుపుకోవచ్చన్నారు. దేశవ్యాప్తంగా నీటి సమస్య ఉందని, అందుకు నదులు అనుసంధానం ఏకైక మార్గమని తేల్చేశారు. నదుల అనుసంధానం జరగాలంటే అది మోదీకి సాధ్యమని తేల్చేశారు. గోదావరి నీళ్లు నల్లమల సాగర్‌కు రావాలన్నారు. గోదావరి నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయని, వాటిని దారి మళ్లించగలిగితే ప్రజలకు సంపద సృష్టిస్తాయన్నారు.

మెగా డీఎస్సీని ఎంతో పారదర్శకంగా నిర్వహించినా కొందరు బురద జల్లే ప్రయత్నం చేశారు విరుచుకుపడ్డారు. కర్నూలు కొండారెడ్డి బురుజు, అమరావతి, విజయవాడలో అంబేద్కర్ సాక్షిగా విశాఖలో బే ఆఫ్ బెంగాల్ సాక్షిగా టీచర్లు ఉద్యమం చేశారన్నారు. ఆ పార్టీ వైఖరి మారకపోతే బే ఆఫ్ బెంగాల్‌లో కలిపేస్తామని అన్నారని గుర్తు చేశారు.

ALSO READ: రైలు ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. కొవ్వూరులో పట్టాలు తప్పిన గూడ్స్.. రాకపోకలకు అంతరాయం

Related News

వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు

రైలు ప్రయాణికులకు గమనిక.. కొవ్వూరులో పట్టాలు తప్పిన గూడ్స్, రైళ్ల రాకపోకలకు అంతరాయం

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ సిటీలో చినుకులు..

సీఎం చంద్రబాబుపై జగన్ రుసరుసలు.. వెలిగొండ ప్రాజెక్ట్ క్రెడిట్ మానాన్నది, ఇదిగో డీటేల్స్

మూడు దశాబ్దాల నిరీక్షణ.. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం, శంకుస్థాపన-ప్రారంభోత్సవం సీఎం చంద్రబాబుదే

పబ్లిసిటీ పిచ్చి తప్ప ప్రజల కష్టాలు పట్టవా? సీఎం చంద్రబాబుపై బొత్స ఫైర్!

గుంటూరు ల్యాండ్ వివాదం.. చంద్రబాబుకు జోగి రమేష్ ఓపెన్ ఛాలెంజ్.. దమ్ముంటే ఎంక్వైరీ వేసుకోండి!

Big Stories

Advertisement
×