E-Paper
Advertisement

పబ్లిసిటీ పిచ్చి తప్ప ప్రజల కష్టాలు పట్టవా? సీఎం చంద్రబాబుపై బొత్స ఫైర్!

పబ్లిసిటీ పిచ్చి తప్ప ప్రజల కష్టాలు పట్టవా? సీఎం చంద్రబాబుపై బొత్స ఫైర్!
Advertisement

Botsa Satyanarayana: రాష్ట్రంలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. సీఎం చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి, వ్యక్తిగత విమర్శలు తప్ప.. ప్రజల సమస్యలపై చీమ కుట్టినట్లు కూడా లేదని ఆరోపించారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ లో కిలో బియ్యం 70 రూపాయలు ఉందని.. చంద్రబాబులా డబ్బులు ఉన్న వాళ్లు అందరూ కాదని అన్నారు.

పెరిగిన ధరలతో సామాన్యులు, మధ్య తరగతి పరిస్థితి దారుణంగా ఉందని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ధిక పరిస్థితి బాగోలేక పిల్లలతో కలిసి ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. అటు డీఎస్సీ మీద చర్చకు రండి అంటే చంద్రబాబు, లోకేష్ ముందుకు రాలేదని ఎద్దేవా చేశారు. పరీక్షలు రాయకుండా ఉద్యోగాలు దేశంలో ఎక్కడైనా ఇస్తారా? అని ప్రశ్నించారు.
DSC పై శాసన మండలిలో ఎందుకు చర్చ పెట్టలేదని నిలదీశారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని పట్టుబట్టారు.

Advertisement

మరోవైపు విజయ సాయి రెడ్డి అంశం గురించి కూడా బొత్స స్పందిస్తూ.. సెటైర్లు వేశారు. ఆయన గురించి మాట్లాడటం ఎందుకులే అని ఎద్దేవా చేశారు. ఆయన కే.ఏ పాల్ 2.0 అని విమర్శించారు. సాయిరెడ్డి ప్రస్తుతం ఖాళీగా ఉన్నారని చురకలు అంటించారు. అటు పవన్ కళ్యాణ్ సైతం ఖాళీగానే ఉన్నారని.. 4 క్యాబినేట్ సమావేశాలకు ఆయన దూరంగా ఉన్నారని ఆరోపించారు.

Also Read: కొండా ఫ్యామిలీ దారెటు? తీన్మార్ మ‌ల్ల‌న్న పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ ఏమిటీ? బీసీల కార్డులు ప‌నిచేయ‌డం లేదా? 

Advertisement

అటు సీఎం చంద్రబాబు.. వెలిగొండ, పోలవరం ప్రాజెక్టులు పేరు చెప్పుకొని బతుకుతున్నారని బొత్స విమర్శించారు. పంచదార్ల కొండలపై ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదన్నారు. ప్రభుత్వం జీవోలు ఇచ్చి.. మళ్లీ తవ్వకాలు జరిపిస్తుందని ఆరోపించారు. మళ్లీ తవ్వకాలు జరిపిస్తుంది. పంచదార్ల కొండపై మళ్ళీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అటు స్థానిక సంస్థలకు వైసీపీ సిద్దంగా ఉందని బొత్స స్పష్టం చేశారు.

Also Read: యురేనియం డీల్, ఫ్రీ వీసా, పౌర పురస్కారం.. ప్రధాని ఉజ్బెకిస్థాన్ పర్యటన సూపర్‌ హిట్!

Tags

Related News

గుంటూరు ల్యాండ్ వివాదం.. చంద్రబాబుకు జోగి రమేష్ ఓపెన్ ఛాలెంజ్.. దమ్ముంటే ఎంక్వైరీ వేసుకోండి!

రాయలసీమ అభివృద్ధిపై.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విజన్!

విజయసాయిరెడ్డి ఎక్కువగా ఊహించుకోవద్దు.. పబ్లిసిటీ కోసమే-సజ్జల కౌంటర్ ఎటాక్

షాకైన వైసీపీ పెద్దలు.. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై కేసు, అసలు ఏం జరిగింది?

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరి హైదరాబాద్ మాటేంటి?

జై కొడుతూనే జేబులు కొట్టేశారు.. మంత్రుల పర్యటనలో జేబు దొంగల హల్‌చల్

తాకట్టు ఉంగరం గొడవ ప్రాణాలు తీసిందా? వేల్పూరు దంపతుల ఆత్మహత్య వెనుక అసలు కథ!

Big Stories

Advertisement
×