E-Paper
Advertisement

‘మావిగన్’పై సైటెర్లు.. తల్లిని కోర్టుకు ఈడ్చిన వ్యక్తి మనకు ఆదర్శమా? అమరావతి ఆగేది లేదన్న సీఎం చంద్రబాబు

‘మావిగన్’పై సైటెర్లు.. తల్లిని కోర్టుకు ఈడ్చిన వ్యక్తి మనకు ఆదర్శమా? అమరావతి ఆగేది లేదన్న సీఎం చంద్రబాబు
Advertisement

CM Chandrababu:  జగన్.. వైసీపీ పార్టీని చీల్చిచెండారారు సీఎం చంద్రబాబు.  కొద్దిరోజులుగా ఆ పార్టీ, నేతలు వ్యవహరిస్తున్న తీరును దుయ్యబట్టారు. ఒక నాయకుడ్ని సైకో అనుకున్నాము గానీ.. పార్టీ అంతా సైకోగా మారిందన్నారు. మొన్న మూడు ముక్కలాట అన్నారని, ఇప్పుడేమో ‘మావిగన్’ ప్రస్తావించడంపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

సూరేపల్లి సభలో జగన్‌పై సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

Advertisement

ఇంకా నయం వాటికన్ పేరు పెడతామని అనలేదని అన్నారు. ఇంకా దాని  పరువు, ప్రతిష్ఠ తీయలేదన్నారు. అలాంటి నేత నుంచి దీని కంటే మీరు ఏమి ఆశించలేరన్నారు. ఆడబిడ్డల గౌరవాన్ని గురించి మాట్లాడుతున్నారని, అమరావతి ఆడబిడ్డలను ఎన్ని అవమానాలకు గురి చేశారని ప్రశ్నించారు.

చివరకు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి మహిళల క్యారెక్టర్ చంపేశారని అన్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు యాత్ర చేపడితే రోడ్లపై భోజనం చేయడానికి వీల్లేకుండా గ్రామాల్లో కూడా హింసలు పెట్టారన్నారు. చివరకు నా భార్యను వదల్లేదన్నారు. గతంలో జగన్ భార్య భారతిరెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తాను ఖండించానని, సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

Advertisement

‘మావిగన్’పై సైటెర్లు.. తల్లిని కోర్టుకు ఈడ్చిన వ్యక్తి మనకు ఆదర్శమా?-సీఎం చంద్రబాబు

గతంలో జగన్ భార్య భారతిరెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తాను ఖండించానని, అయినా సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.  తల్లిని కోర్టుకు ఈడ్చిన వ్యక్తి మనకు ఆదర్శం కాకూడదని అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని సూరేపల్లిలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన,  బుధవారం పార్టీ నేతల సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కౌంటరిచ్చారు. అమరావతిని కట్టలేమని కొత్త పలుకులు పలుకుతున్నారని, నీలాంటి వెయ్యి మంది సైకోలు వచ్చినా నిర్మాణం జరుగుతుందన్నారు. ఇలాంటి వ్యక్తుల వల్ల మనకు ప్రమాదం ఉంటుందన్నారు.

అధికారంలో ఉన్నంతకాలం విధ్వంసం చేశారని, ప్రతిపక్షంలో ఉంటే బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. తాము వస్తే మళ్లీ విచారణ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని దుయ్యబట్టారు. గోవాను తలదన్నేలా సూర్యలంక బీచ్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. అలాంటి అందాలు ఇక్కడ ఉన్నాయన్నారు.

ALSO READ: మంత్రి కొండపల్లిపై సీఎం చంద్రబాబు సీరియస్.. అసలు ఏం జరిగింది?

దీనివల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయం కాకుండా టూరిజం కూడా అభివృద్ది చెందుతుందని, ఉద్యోగాలు వస్తాయన్నారు. రైతులకు ఇచ్చే పాస్ బుక్ లను ఎవరూ తారుమారు చేయలేదన్నారు సీఎం. కరెన్సీకి ఎలాంటి టెక్నాలజీ వినియోగించామో, పట్టాదారు పాస్ పుస్తకాలకు అదే వాడామన్నారు. వీటిని ఎవరూ తారుమారు చేయలేరన్నారు.

పుస్తకాలపై క్యూఆర్ కోడ్ ఉంటుందని, మీ భూమి వేరే ఎవరూ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా రికార్డులకు డిజిటల్ లాక్ చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. భూ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపిస్తున్నామని వెల్లడించారు. మీ ముందు సర్వే చేయించి రికార్డు చేస్తామన్నారు. ఈ-కేవైసీ చేశాకే పట్టాదారు పాస్‌ పుస్తకం ఇస్తామన్నారు. భూ యజమాని సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. రూపాయి కూడా అవినీతి లేకుండా పాస్ పుస్తకాలు ఇవ్వాలనేది నా ఆలోచనగా చెప్పుకొచ్చారు.

Related News

Hanuman Idol: ఏపీలో దేవుడికే రక్షణ లేదు.. చంద్రబాబుపై విరుచుకుపడ్డ యాంకర్ శ్యామల!

కాంగ్రెస్ ఆఫీసుపై రౌడీల్లా దాడి చేస్తారా? బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డ షర్మిల!

YS Jagan: పొగాకు రైతులకు జగన్ భరోసా.. త్వరలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన!

Pawan Kalyan: ఎల్ నినో భయాలకు చెక్! పవన్ కళ్యాణ్ ముందస్తు వ్యూహం.. ఆ జిల్లాలకు పండగే!

48 ఏళ్లుగా బస్సే లేని గ్రామం.. ఎట్టకేలకు ఊర్లోకి ఎర్రబస్సు.. ఎక్కడో చూసేయండి!

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. బీఎస్సీ అగ్రికల్చర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్, కేవల ఐదు రోజులు మాత్రమే

ఢిల్లీలో సీఎం చంద్రబాబు, మోదీ-షాతో కీలక సమావేశం, వరుస పరిణామాలు, ఆ బాధ్యతలు అప్పగింత!

ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో రాత్రి నుంచి.. బంగాళాఖాతంలో అల్పపీడనం!

Big Stories

Advertisement
×