E-Paper
Advertisement

ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో రాత్రి నుంచి.. బంగాళాఖాతంలో అల్పపీడనం!

ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో రాత్రి నుంచి.. బంగాళాఖాతంలో అల్పపీడనం!
Advertisement

Weather News: దక్షిణాది రాష్ట్రాలపై వరుణుడు కరుణించాడు. మంగళవారం సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రాత్రి కూడా కంటిన్యూ అయ్యాయి. ఫలితంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌లో బుధవారం ఉదయం వరకు వర్షం పడుతూనే ఉంది. దీంతో ఉదయం డ్యూటీలకు వెళ్లాల్సినవారు ఇబ్బందులు పడ్డారు.

ఏపీ-తెలంగాణల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు-బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతోంది. ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని కారణంగా ఏపీ, తెలంగాణ, మహరాష్ట్ర లతోపాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. జులై 27 వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ చెప్పింది.

Advertisement

ఈనెల 27 వరకు వర్షాలు-వర్షానికి తోడు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయని వెల్లడించింది. వర్షం సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.తెలంగాణలో జులై 22-27 వరకు వర్షాలతోపాటు ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. దాదాపు రెండు నెలలుగా బ్రేక్​ ఇచ్చిన వర్షాలు ఇప్పుడు ఊపందుకుంటున్నాయి.

బంగాళాఖాతంలో అల్పపీడనం!  ఏపీ-తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి వానలు దంచి కొడుతున్నాయి. రాత్రి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. దక్షిణ తెలంగాణలో ఓ మోస్తరు వర్షం కురిసినట్టు తెలిపింది. వర్షాలు పడుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు సైతం ఊపిరి పీల్చుకుంటున్నారు. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Advertisement

నేడు లేదా రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షాకాలం ఈ సీజన్ లో మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి, ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్​, జయశంకర్​ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లోనూ వానలు కుమ్మేశాయి. మంచిర్యాల జిల్లాలోని జనకాపూర్, కోటపల్లి, తాండూరు ప్రాంతాల్లో 12 సెంటీమీటర్లు పైగానే వర్షం కురిసింది. ఆంధ్రప్రదేశ్‌లో జులై 22న వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది.

 

 

Related News

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

Big Stories

Advertisement
×