BigTV English

CM Chandrababu: ప్రకాశం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర.. బోట్లు వదిలింది వైసీపీ వాళ్లే.. చంద్రబాబు

CM Chandrababu: ప్రకాశం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర..  బోట్లు వదిలింది వైసీపీ వాళ్లే.. చంద్రబాబు

CM Chandrababu with flood victims and farmers: ప్రకాశం బ్యారేజీని కూల్చేందుకు వైసీపీ కుట్ర చేసిందని , అందుకే బోట్లు వదిలారని సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఏలూరు జిల్లాలో వరద బాధితులు, రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ పాలకుల పాపాలు.. మనపాలిట శాపాలుగా మారాయన్నారు.


ప్రకాశం బ్యారేజీ కూల్చేందుకు వైసీపీ నాయకులు బోట్లు వదిలి పెను ప్రమాదం చేసేందుకు ప్రయత్నించారన్నారు. 50 టన్నుల బరువు ఉన్న బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయన్నారు. ఒకవేళ ప్రకాశం బ్యారేజీ కూలిపోయినట్లయితే లంక గ్రామాల పరిస్థితి ఎలా ఉండేదోనని ఆందోళన చెందారు. ఆ బోట్లతోనే గతంలో అక్రమ ఇసుక వ్యాపారం చేశారన్నారు.

వాతావరణ మార్పులతో క్లౌడ్ బరస్ట్‌లు వస్తున్నాయని, వరదల సమయంలో వైసీపీ నాయకులు కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. గతంలో బుడమేరు గండ్లు పూడ్చకపోవడం వల్లే విజయవాడకు ఈ పరిస్థితి వచ్చిందని, గత ప్రభుత్వం బుడమేరులో పూడిక తీయలేదని గండ్లు పూడ్చలేదని ఆరోపించారు.


అంతకుముందు, ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం రోడ్డు మార్గంలో తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించిన ఆయన కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×