BigTV English

Nara Family In Tirumala : దేవాన్ష్ బర్త్ డే.. నారా కుటుంబం తిరుమలలో సందడి..

Nara Family In Tirumala : దేవాన్ష్ బర్త్ డే.. నారా కుటుంబం తిరుమలలో సందడి..
Nara Family In Tirumala
Nara Family In Tirumala

Nara Family In Tirumala :నారా కుటుంబ  సభ్యులు తిరుమలలో సందడి చేశారు. గురువారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ , బ్రహ్మిణి దంపతులు కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తిరుమల వెళ్లారు. శ్రీవారిని దర్శించుకున్నారు.  స్వామి దర్శనం తర్వాత నారా లోకేశ్, బ్రహ్మణి, దేవాన్ష్ , భువనేశ్వరిని రంగ నాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు.


Also Read: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ మార్గంలో జాగ్రత్త..

తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంబమాంబ సత్రంలో అన్నదానం చేశారు. లోకేశ్ దంపతులు స్వయంగా భక్తులకు ఆహారం వడ్డించారు. భక్తులకు అల్పాహారం అందించారు. దేవాన్ష్ రోజు వేళ ఒకరోజు అన్నదానం కోసం రూ. 38 లక్షలు విరాళంగా టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు నారా కుటుంబం అందించింది.


మరో వైపు ఏపీ ఎన్నికల నేపథ్యంలో దేవాన్ష్ తాత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బీజీగా ఉన్నారు.  ఈ నేపథ్యంలో ఆయన మనవడి పుట్టినరోజు వేళ తిరుమలకు రాలేకపోయారు.  అదే సమయంలో చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఏపీలో ఎన్నికల వ్యూహంపై చర్చించారు.

మరోవైపు దేవాన్ష్ తండ్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కూడా ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో బీజీగానే ఉన్నారు. కొడుకు పుట్టినరోజు కోసం ఎన్నికల ప్రచారానికి లోకేశ్ కాస్త విరామం ఇచ్చారు.  ఇంకోవైపు దేవాన్ష్ నానమ్మ భువనేశ్వరి కూడా ప్రజల్లో తిరుగుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. తీరిక లేకుండా ఇలా నారా ఫ్యామిలీ మొత్తం జనంలో ఉంది. మనవడి పుట్టినరోజు వేళ భువనేశ్వరి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు.

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×