Harshit Rana – Gambhir : ఆసియా కప్ 2025 ప్రస్తుతం జరుగుతోంది. ఇప్పటికే లీగ్ దశ, సూపర్ 4 దశ మ్యాచ్ లు ముగిసాయి. రేపు టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం స్టేడియాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. సూపర్ 4 దశలో నిన్న శ్రీలంక వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో శ్రీలంక పై టీమిండియా విజయం సాధించింది. అయితే లీగ్ దశలో ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో బుమ్రా, వరుణ్ చక్రవర్తికి విశ్రాంతిని ఇవ్వగా.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బుమ్రా, శివమ్ దూబేకి విశ్రాంతి ఇచ్చారు.
Also Read : IND VS PAK, Final: ఫైనల్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ..అభిషేక్ శర్మ, పాండ్యా ఔట్ ?
దీంతో వారిద్దరి ప్లేస్ లో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలు ఎంట్రీ ఇచ్చారు. వాస్తవానికి గౌతమ్ గంభీర్ వల్లనే హర్షిత్ రాణాకి టీ-20లో చోటు దక్కింది. సిరాజ్ వంటి కీలక ఆటగాడికి చోటు దక్కకపోవడం గమనార్హం. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో హర్షిత్ రాణా 4 ఓవర్లు వేసి ఏకంగా 54 పరుగులను సమర్పించుకున్నాడు. దీంతో హర్షిత్ రాణా- గంభీర్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. టీమిండియా కి అసలు విలన్ హర్షిత్ రాణానే.. గౌతమ్ గంభీర్ వల్లనే ఈ చెత్త ప్లేయర్ ఆడుతున్నాడని సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 20వ ఓవర్ హర్షిత్ రాణా బౌలింగ్ చేశాడు. 6 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి ఉండగా.. శ్రీలంక జట్టు 11 పరుగులు చేసి టై చేసింది. అంతకంటే ముందు హర్షిత్ రాణా 3వ ఓవర్ లో 12 పరుగులు, 5వ ఓవర్ లో 16 పరుగులు, 11వ ఓవర్ లో 17 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో హర్షిత్ రాణా, గౌతమ్ గంభీర్ లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
హర్షిత్ రాణా ఇలా పరుగులు సమర్పించుకోవడంతో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ అతనిపై చాలా ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరో వైపు నిన్న అభిషేక్ శర్మ సిక్స్ ల కోసం బంతులను గాల్లోకి లేపుతుంటే కూడా కాస్త కోపంగానే స్పందించాడు గంభీర్. దీంతో పాకిస్తాన్ తో మ్యాచ్ లో మరెవ్వరితో గొడవ పెట్టుకుంటాడని కామెంట్స్ వినిపించడం విశేషం. సెప్టెంబర్ 28న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ జరుగబోతుంది. ఈ మ్యాచ్ హోరా హోరీగా జరుగనుంది. ఇప్పటికే రెండుసార్లు ఓటమి పాలైన పాకిస్తాన్.. ఈసారి టాస్ గెలిచి ఎలాగైనా తొలుత ఫీల్డింగ్ తీసుకుంటే.. టీమిండియా పై ఘన విజయం సాధించవచ్చని భావిస్తోంది. టీమిండియా మాత్రం తొలుత బ్యాటింగ్ తీసుకున్నా.. బౌలింగ్ తీసుకున్నా విజయం మాత్రం మాదే అని ధీమాతో ఉంది.