BigTV English

Mobile Charger : ఛార్జర్‌కు టేప్ వేసి వాడుతున్నారా..?

Mobile Charger : ఛార్జర్‌కు టేప్ వేసి వాడుతున్నారా..?
Mobile Charger
Mobile Charger

Mobile Charger (latest tech news): ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ వాడకం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేతిలో పైసా లేకున్నా.. స్మార్ట్ పక్కాగా ఉండాలి. స్కూల్‌కు వెళ్లే పిల్లల నుంచి ఇంట్లో ఉండే పెద్దల వరకు స్మార్ట్‌ఫోన్ వాడకమనేది వ్యసనంగా మారింది. జీవితంలో స్మార్ట్‌ఫోన్ ఒక భాగమైంది. దీని అవసరం లేకుండా ఏ పని కూడా జరగడం లేదు. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి.


ముఖ్యంగా మొబైల్ చార్జర్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఫోన్‌ను ఎక్కడపడితే అక్కడ చార్జింగ్ పెడుతుంటారు. అలానే మొబైల్ కంపెనీ ఫోన్‌తో పాటుగా ఇచ్చినా చార్జర్ ఉపయోగించకుండా నకిలీవి వాడతారు. ఇలా వాడటం వల్ల మొబైల్ త్వరగా పాడవుతుంది. మరి కొందరు ఎక్కువ సమయం చార్జింగ్ పెడతారు. ఇందువల్ల కూడా నష్టమే ఉంటుంది. మరికొందరు చార్జింగ్ కేబుల్ డ్యామేజ్ అయినా.. ఆ స్థానంలో టేప్ వేసి వాడుతుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

Also Read : హోలీ ఆడాలనుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి


మొబైల్ ఫోన్ విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఫోన్ బ్యాటరీ తొందరగా డ్యామేజ్ అవుతుంది. చార్జింగ్ ఎంతే సేపు పెట్టినా ఫుల్ కాదు. చార్జింగ్ త్వరగా డౌన్ అవుతోంది. ఫోన్ త్వరగా హీట్ అవుతుంది. మొబైల్ తయారు చేసేప్పుడే దానికి తగ్గట్టుగా కంపెనీ చార్జర్ కూడా తయారు చేస్తుంది. కాబట్టి ఆ చార్జర్ వల్ల ఎటువంటి నష్టం ఉండదు. నకిలీ చార్జర్ వాడటం వల్ల బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది.

కొన్ని సందర్భాల్లోనకిలీ చార్జర్ వాడడం వల్ల బ్యాటరీ ఉబ్బుతుంది. దీని కారణంగా రేడియేషన్‌కు గురై బ్యాటరీ పేలే అవకాశం ఉంటుంది. మీరు ఫోన్ 100 శాతం చార్జింగ్ పెట్టినా కూడా ఈ సమస్యకు దారితీయొచ్చు. అలానే ఫోన్ హ్యాంగింగ్, సాఫ్ట్‌వేర్ సమస్యలు కూడా రావొచ్చు. అందువల్ల స్మార్ట్‌ఫోన్ వినియోగించేవారు కచ్చితంగా కంపెనీ ప్రొవైడ్ చేసిన చార్జర్ మాత్రమే వాడాలి. లేదంటే మీ ఫోన్ బ్యాటరీ డ్యామేజ్ అవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read :  ఓ మై గాడ్.. ఒక షర్ట్ ధరకే 5G ఫోన్.. ఎగబడిపోతున్న కస్టమర్స్!

మనలో కొందరు స్మార్ట్‌ఫోన్ చాలా కేర్‌గా చూసుకుంటారు. అయితే ఒక్కోసారి చార్జింగ్ కేబుల్ డ్యామేజైతే ఆ ప్రదేశంలో టేప్ వేసి కనెక్ట్ చేస్తారు. కానీ దీనివల్ల చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. యునిటైడ్ కింగ్ డమ్ లోని ఎలక్ట్రికల్ సేప్టీ ఇనిస్టిట్యూట్ అధ్యయనాల ప్రకారం.. రిపేర్ చేసిన చార్జర్లు వాడితే పేలిపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఇప్పటికే చాలానే జరిగాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి చార్జింగ్ విషయంలో కేర్‌గా జాగ్రత్తగా ఉండండి.

Disclaimer: ఈ కథనాన్ని టెక్ నిపుణులు సలహా మేరకు రూపొందించాం. దీనిని అవగాహనగా మాత్రమే భావిచండి.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×