BigTV English

EX MLA VITALREDDY SHOCK TO BRS : బీఆర్ ఎస్‌కు షాక్‌.. సొంత గూటికి మాజీ ఎమ్మెల్యే

EX MLA VITALREDDY SHOCK TO BRS : బీఆర్ ఎస్‌కు షాక్‌.. సొంత గూటికి మాజీ ఎమ్మెల్యే

 


BRS EX MLA VITALREDDY TO BE JOINING CONGRESS
BRS EX MLA VITALREDDY TO BE JOINING CONGRESS

EX MLA VITALREDDY JOIN TO CONGRESS ( political news today ): లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ తెలంగాణ‌లో బీఆర్ ఎస్‌కు షాకులు ఇస్తున్నారు ఆ పార్టీలోని కీల‌క నేత‌లు. ఇప్ప‌టికే చాలామంది ఇటు కాంగ్రెస్‌.. అటు బీజేపీలోకి చేరిపోతున్నారు. తాజాగా ఆ జాబితాలోకి ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠ‌ల్‌రెడ్డి చేరిపోయారు. ఆయన కాంగ్రెస్ తీర్థం పుచుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే సీనియ‌ర్ నేత‌ల‌తో మంత‌నాలు సాగించారు. ఈ క్ర‌మంలో సీఎం రేవంత్‌రెడ్డితో ఆయ‌న భేటీ అయ్యారు.

ముఖ్య‌మంత్రి నుంచి సానుకూల సంకేతాలు రావ‌డంతో  సొంత గూటికి చేరుకున్నారు విఠల్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలువురు నేతలు అక్కడే ఉన్నారు. అంతకుముందు మంత్రి సీతక్కతో సమావేశమైయ్యారాయన. ముధోల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన విఠల్ రెడ్డి, అప్ప‌టి రాజ‌కీయ ప‌రిస్థితుల కారణంగా బీఆర్ ఎస్‌కి వెళ్లారు. 2018లో కూడా ఆ పార్టీ నుంచే పోటీ చేసి మ‌రోసారి విజ‌యం సాధించారు. అయితే 2023 ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.


కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అన్నట్లు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఫాదర్ ముధోల్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సింపుల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే ముధోల్ నియోజకవర్గం విఠల్ ఫ్యామిలీకి కంచుకోట.

Tags

Related News

Hyderabad Floods: హైదరాబాద్ వరద బాధితులకు అండగా ఉండండి.. అభిమానులకు పవన్ సూచనలు

Nagarkurnool: ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డికి వింత కష్టం!

Musi Floods: MGBS నుంచి బ‌స్సుల రాక‌పోక‌లు నిలిపివేత..! ఏ బస్సు ఏ రూట్లో వెళ్తుందంటే..?

Hyderabad Rains Today: వర్షం కారణంగా ఉప్పొంగిన ముసీ నది.. చాదర్‌ఘాట్ బ్రిడ్జ్ మూసివేత

VC Sajjanar: తెలంగాణలో IAS, IPS ల బదిలీలు.. హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్

Hyderabad Rains: జలదిగ్భందంలో హైదరాబాద్.. మునిగిన ముసారాంబాగ్ బ్రిడ్జి

Rain Update: ముంచుకోస్తున్న ముప్పు.. మరో రెండు రోజులు భారీ వర్షాలు..

KTR: తెలంగాణ ప్రజలపై రూ.15వేల కోట్ల భారం.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు

Big Stories

×