E-Paper
Advertisement

అత్తమామలను కారుతో తొక్కించేసిన అల్లుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

అత్తమామలను కారుతో తొక్కించేసిన అల్లుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Advertisement

Mangalagiri: మనుషుల మధ్య బంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో చెప్పడానికి గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. భార్య తనతో కాపురానికి రావడం లేదన్న కోపంతో, కన్నవారిపై కక్ష పెంచుకున్న ఓ అల్లుడు ఏకంగా వారి ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడ్డాడు. యాక్సిడెంట్ లాగా సృష్టించి అత్తమామలను కారుతో గుద్దేసిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగింది?

Advertisement

గుంటూరు జిల్లాకు చెందిన రాజబాబు అనే యువకుడు ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, పెళ్లయిన కొంతకాలానికే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, తీవ్ర విభేదాలు మొదలయ్యాయి. దీంతో మనస్తాపానికి గురైన భార్య, భర్తను వదిలేసి మంగళగిరిలోని తన పుట్టింటికి వచ్చేసింది. ఎంత చెప్పినా భార్య తిరిగి కాపురానికి రాకపోవడం, దానికి అత్తమామల ప్రోత్సాహమే కారణమని రాజబాబు గట్టిగా నమ్మాడు. వారిపై తీవ్ర ఆగ్రహం, కక్ష పెంచుకున్నాడు.

హత్యకు సుపారీ.. స్కెచ్ ఫెయిల్ కావడంతో!

Advertisement

అత్తమామలైన శ్రీనివాసరావు, పద్మావతిలను ఎలాగైనా అంతమొందించాలని రాజబాబు ఒక కిరాతక ప్లాన్ వేశాడు. ఇందుకోసం ఒక కారును అద్దెకు తీసుకున్నాడు. మొదట తనే నేరుగా రంగంలోకి దిగకుండా, వారిని కారుతో ఢీకొట్టి హత్య చేయాలంటూ ఇద్దరు వ్యక్తులకు రూ. 20,000 సుపారీ కూడా ఇచ్చాడు. అయితే, సదరు సుపారీ గ్యాంగ్ వేచి చూసిన సమయంలో అత్తమామలు ఇద్దరూ బయటకు రాకపోవడంతో ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. దీంతో విసిగిపోయిన ఆ గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

Also Read: బూతు పోస్టులు పెడితే తాట తీస్తారు! ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్!

నేరుగా రంగంలోకి దిగి..

సుపారీ గ్యాంగ్ పని పూర్తి చేయకపోవడంతో రాజబాబు స్వయంగా రంగంలోకి దిగాడు. గత నెల 26వ తేదీన మంగళగిరి ఆర్ అండ్ బి జంక్షన్ వద్ద అత్తమామలు శ్రీనివాసరావు, పద్మావతి నడుచుకుంటూ వెళ్తుండటం గమనించాడు. అంతే, క్షణికావేశంలో అద్దెకు తీసుకున్న కారుతో వారిద్దరినీ వేగంగా ఢీకొట్టాడు.

వెలుగులోకి వచ్చిన నిజం

కారు బలంగా ఢీకొట్టడంతో శ్రీనివాసరావు, పద్మావతి తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మొదట ఇదొక సాధారణ రోడ్డు ప్రమాదం అనుకున్నప్పటికీ, ఘటన జరిగిన తీరుపై కుటుంబ సభ్యులకు తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో అల్లుడు రాజబాబే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు నిజం బయటపడింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ఎల్ నినో కంటే జగనే పెద్ద విపత్తు.. మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్!

విశాఖ రేవ్ పార్టీలో నేతల మధ్య రచ్చ.. అమ్మాయిల కోసం కొట్లాట, ఆపై కత్తిపోట్లు, అసలు ఏం జరిగింది?

ఆటోను ఢీ కొట్టి ట్రావెల్ బస్సు, ఏడుగురు మృతి, మరో 8 మంది పరిస్థితి విషమం, చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం

పవన్ vs జగన్.. పులివెందుల దాహార్తి తీర్చిందెవరు? ఎవరి పాత్ర ఎంత?

డైరెక్షన్.. ప్రొడక్షన్ కాదు ఫైనాన్స్ కూడా.. టైమ్-డేట్-లోకేషన్ ఎప్పుడైనా నేను సిద్ధమే, జగన్‌కు లోకేష్ ఛాలెంజ్

చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏకేసిన మాజీ సీఎం, కేవలం మూడు అంశాలను టార్గెట్ చేసిన జగన్

కారుమూరి అరెస్టుపై నోరు విప్పిన జగన్.. జిల్లా స్థాయిలో జరిగే కాంట్రాక్టులంటూ సరికొత్త పల్లవి

ఏకగ్రీవాలకు అంగీకరిస్తే.. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవ్.. వైసీపీ నేతలకు జగన్ వార్నింగ్

Big Stories

Advertisement
×