E-Paper
Advertisement

బూతు పోస్టులు పెడితే తాట తీస్తారు! ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్!

బూతు పోస్టులు పెడితే తాట తీస్తారు! ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్!
Advertisement

Social Media: రెచ్చగొట్టే పోస్టులు, ఫేక్ ఫోటోలు, అవమానించే భాష, అనుమానించే కథనాలు, అసభ్యకరమైన మాటలు సోషల్‌మీడియా ఓపెన్ చేయగానే కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. దేవుళ్లను, మతాలను అవమానించి సమాజంలో విద్వేషం మంటల్ని పెడుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు బాధ్యత, భయం ఉంటాయి. కానీ సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలతో, మార్ఫింగ్ వీడియోలతో ఏదైనా చేస్తున్నారు.  మహిళా ప్రజాప్రతినిధులు, చివరికి న్యాయమూర్తులను కూడా వదలిపెట్టడం లేదు. టార్గెట్‌ చేసి మరీ ట్రోలింగ్‌ చేస్తున్నారు.

స్పెషల్ వార్ ఏర్పాటు

Advertisement

ఒక అకౌంట్‌ను బ్యాన్ చేస్తే.. క్షణాల్లో వంద ఫేక్ అకౌంట్లు పుట్టుకొస్తున్నాయి. అందుకే సోషల్‌మీడియా ఆగడాలను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబోతోంది. కేవలం నార్మల్ పోలీసింగ్‌తో ఈ డిజిటల్ నేరాలను అడ్డుకోవడం అసాధ్యం. అందుకే అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఫోరెన్సిక్ టూల్స్ వాడటానికి, అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్‌లను ఛేదించడానికి బయటి నుంచి సైబర్ నిపుణులను, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను రంగంలోకి దించబోతోంది. ఎవరైనా అసభ్యకరంగా పోస్ట్‌ చేసినా… విద్వేషాలను రెచ్చగొట్టేలా ఫోటోలు పెట్టినా తాట తీస్తామంటోంది ప్రభుత్వం.

టాస్క్‌ఫోర్స్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వైసీపీ

Advertisement

ఈ టాస్క్‌ఫోర్స్ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కూటమి ప్రభుత్వం తమ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులను, ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ఈ టాస్క్‌ఫోర్స్‌ని వాడుకుంటోందని ఆరోపిస్తోంది. రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని వైసీపీ వాదన.

ప్రభుత్వానికి సవాల్

ఈ విషయంలో  రాజకీయాలకు అతీతంగా పనిచేయడం ప్రభుత్వానికి పెద్దసవాలే.. తమ పార్టీ వారు పెట్టే బూతు పోస్టులను, ఫేక్ న్యూస్‌లను లైట్ తీసుకుని.. కేవలం ప్రతిపక్షాల వారిపైనే యాక్షన్ తీసుకుంటే టాస్క్‌ఫోర్స్ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. అది పొలిటికల్ టూల్‌గా మారకుండా ఫేక్ న్యూస్‌ను మాత్రమే అడ్డుకోవాలి.. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.

Related News

తిరుపతికి చంద్రబాబు భారీ వరాలు.. రూ.3,222 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం!

బీసీల ఎదుగుదల జగన్‌కు ఇష్టం లేదు: మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి

మానవ హక్కుల కమిషన్ నియామకాల్లో తొందరెందుకు? చంద్రబాబుకు బొత్స లేఖ

రీల్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తున్న శ్రీకాకుళం చిన్నారి..?

కూటమి ప్రభుత్వంపై కామెంట్ చేసిన చిరంజీవి.. ఏమన్నారంటే?

నెల్లూరు సర్వేపల్లి కట్ట వాసులకు.. ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు!

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం!

ఏపీలోని బీసీలకు భారీ గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన!

Big Stories

Advertisement
×