BigTV English

Extortion in Education Scheme: విద్యాకానుకలో అవినీతి.. వందలకోట్లను దోచుకున్న వైసీపీ..!

Extortion in Education Scheme: విద్యాకానుకలో అవినీతి.. వందలకోట్లను దోచుకున్న వైసీపీ..!

Extortion in Education Scheme by YCP in AP: ఏపీలో ఇటీవలే వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు కూటమికి జై కొట్టిన విషయం సుస్పష్టంగా తెలిసింది. కానీ.. అధికారం కోల్పోయిన వైఎస్సార్సీపీ నేతలు.. తమ ఓటమిని ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నారు. ఈవీఎంలలోని ఓట్లలో ఏదో స్కామ్ జరిగిందని ఒకరు, ఓట్లను సరిగ్గా లెక్కించలేదని మరొకరు, కాదు కాదు.. మా సమస్యల్ని జగన్ తో చెప్పుకోనివ్వకుండా చేశారని ఇంకొకరు, ప్రజలే మోసం చేశారని మరికొంతమంది.. ఇలా వైసీపీ నేతలు తమ ఓటములకు కారణాలు రకరకాలు చెప్పుకొస్తున్నారు. కానీ.. వైసీపీ ఓటమికి కారణం ఆ పార్టీనేతల నోటి దురుసు. ఈ విషయాన్ని ఎవ్వరూ ఒప్పుకోరు.


ఏపీలో జగనన్న విద్యాకానుక పేరుతో వైసీపీ ప్రభుత్వం కోట్లు కొల్లగొట్టిన వార్తొకటి బయటికొచ్చింది. విద్యార్థులకు స్కూల్ బ్యాగుల కిట్లు ఇచ్చేందుకు ఖర్చు చేసిన మొత్తం రూ.150 కోట్ల సొమ్మును ఆ శాఖ మంత్రి, ఆయన పీఏ, అధికారులు తినేశారన్న ఆరోపణలున్నాయి. లెక్కకు మించిన సామాగ్రిని కొన్నట్లు లెక్కలు చూపించి.. సరఫరా లేకుండానే నిధులను స్వాహా చేసేశారు. విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు చిరిగిపోయినా పట్టించుకోలేదు. విద్యాకానుక కోసం టెండర్లు పిలవకుండా.. గుత్తేదార్లకే సరఫరా బాధ్యతలను అప్పగించి డబ్బుల్ని దండుకున్నారన్న విమర్శలున్నాయి.

వైసీపీ ప్రభుత్వంలో మంత్రి కిలకంగా ఉన్న మంత్రి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చినా.. ప్రభుత్వం మౌనంగా ఉండిపోవడం గమనార్హం. పాతగుత్తేదార్లకు రూ.772 కోట్ల విలువ చేసే కాంట్రాక్టును నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. పాఠశాలల్లో ఉన్నది 36.54 లక్షల మంది విద్యార్థులైతే.. విద్యాకానుక కిట్లు 39.51 లక్షలు ఆర్డర్లు ఇచ్చారు. కాగితం ధర తగ్గినా.. ఒక్క నోట్ బుక్ కు పాత ధరకే ఇచ్చారు.


Also Read: ఏపీలో ప్రముఖ న్యూస్ ఛానళ్ల ప్రసారాలు బంద్.. బ్లూ మీడియాకు బిగ్ షాక్ ?

2023-24 విద్యాసంవత్సరంలో ప్రకాశం జిల్లాకు సరఫరా చేసిన బ్యాగ్లు 2-3 నెలల్లోనే చిరిగిపోయాయి. మళ్లీ ఆ గుత్తేదారుకే బ్యాగ్ ల సరఫరా కాంట్రాక్టును అప్పగించారు. 2023లో జరిగిన ఆడిట్ లో.. ప్రజాధనంగా కోట్ల రూపాయల్లో వృథా అయినట్లు తేలింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ లెక్కలన్నింటినీ బయటికి తీసి.. ఎవరెంత నొక్కేశారో లెక్కలు చూసి ఏం చేస్తుందో చూడాలి.

Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×