E-Paper
Advertisement

T20 World Cup 2024 – AFG Vs NZ Highlights: ఆఫ్గాన్ గన్ బౌలింగ్.. కివీస్ 84 పరుగుల తేడాతో ఓటమి!

T20 World Cup 2024 – AFG Vs NZ Highlights: ఆఫ్గాన్ గన్ బౌలింగ్.. కివీస్ 84 పరుగుల తేడాతో ఓటమి!
Advertisement

Afghanistan Won by 84 Runs against New Zealand in T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లో మరో సంచలనం నమోదైంది. మొన్ననే యూఎస్ఏ చేతిలో పోరాడి ఓడిన పాకిస్తాన్ మ్యాచ్ ని మరువకముందే మరో మ్యాచ్ నమోదైంది. గ్రూప్ సిలో ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ 84 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.

గయానాలో జరిగిన మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన ఆఫ్గాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కివీస్ ఘోరంగా విఫలమైంది. 15.2 ఓవర్లలో 75 పరుగులకి ఆలౌట్ అయ్యి.. ఓటమిపాలైంది.

Advertisement

160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ కి శుభారంభం దక్కలేదు. వరుసపెట్టి 4 వికెట్లు ఫటాఫటా పడిపోయాయి. ఓపెనర్ ఫిన్ అలెన్ గోల్డెన్ డకౌట్ దగ్గర నుంచి మొదలైంది. డేవన్ కాన్వే (8), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (9), డారీ మిచెల్ (5) ఇలా వెంటవెంటనే అయిపోయారు. 6.1 ఓవర్లలో 33 పరుగులకి వచ్చేసరికి కీలకమైన 4 వికెట్లు పడిపోయాయి.

Also Read: కొహ్లీ రికార్డుని దాటేసిన.. బాబర్ అజామ్

Advertisement

గ్లెన్ ఫిలిప్స్ (18), మాల్ట్ హెన్రీ (12) ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మార్క్ ఛాప్ మెన్ (4), మిచెల్ బ్రేస్ వెల్ (0), సాంట్నర్ (4) , ఫెర్గ్యూసన్ (2), ట్రెంట్ బౌల్ట్ (3) సింగిల్ డిజిట్ కే అవుట్ అయిపోయారు. నిజానికి కివీస్ ఆటగాళ్లందరూ ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ కి వచ్చినట్టు వచ్చి వెళ్లిపోయారు.
మొత్తానికి 15.2 ఓవర్లలో 75 పరుగులకి ఆలౌట్ అయ్యారు. 84 పరుగుల తేడాతో ఓడి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు.

ఆఫ్గాన్ బౌలింగులో ఫరూఖ్ 4, మహ్మద్ నబి 2, కెప్టెన్ రషీద్ ఖాన్ 4 వికెట్లు తీసి కివీస్ పతనాన్ని శాసించారు.

Also Read: IND vs PAK: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆ మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్ ?

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ లో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 56 బంతుల్లో, 5 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగి 80 పరుగులు చేశాడు. అతనికి తోడుగా మరో ఓపెనర్ జద్రాన్ 41 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అప్పటికి 17 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 127 పరుగులతో ఆఫ్గానిస్తాన్ నిలిచింది.

తర్వాత వచ్చిన ఒమర్ జాయ్ (22), కెప్టెన్ రషీద్ ఖాన్ (6) మిగిలిన వాళ్లు ఇలా వచ్చి అలా వెళ్లడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి పోరాడే స్కోరుని తెచ్చింది.

కివీస్ బౌలింగులో ట్రెంట్ బౌల్ట్ 2, మాట్ హెన్రీ 2, ఫెర్గ్యూసన్ 1 వికెట్లు తీశారు.

Related News

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×