AP Liquor Case: లిక్కర్ వ్యవహారం వైసీపీ నేతలకు చెమటలు పడుతున్నాయి. ఓ వైపు నకిలీ మద్యం.. ఇంకోవైపు లిక్కర్ కుంభకోణం దర్యాప్తు సాగుతోంది. రెండు కేసులపై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఎప్పుడు ఏ నేత ఇంటిపై సోదాలు చేస్తోరనని బెంబేలెత్తిపోతున్నారు ఆ పార్టీ నేతలు.
లిక్కర్ స్కామ్.. మళ్లీ సిట్ సోదాలు
తాజాగా మంగళవారం ఉదయం లిక్కర్ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సిట్ సోదాలు చేపట్టింది. ఈ కేసులో ఆయన ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఇటీవల అరెస్టయిన ఆయన, 71 రోజులకు పైగానే జైలులో ఉన్నారు. ఇటీవల ఆయనకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేపో మాపో ఆయనకు సంబంధించి ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుంది సిట్.
తాజాగా తిరుపతి, హైదరాబాద్, బెంగుళూరులోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది సిట్. ఫిల్మ్‌నగర్‌లోని ప్రశాసన్ నగర్, యూసుఫ్‌గూడ ప్రాంతంలోని గాయత్రీహిల్స్ ఇంట్లోనూ ఈ సోదాలు చేస్తున్నారు. మొత్తం నాలుగు బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు చేస్తున్నాయి. మిథున్‌రెడ్డి కుటుంబసభ్యులతో పాటు ఆఫీసు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు అధికారులు.
తిరుపతి, హైదరాబాద్, బెంగుళూరు ప్రాంతాల్లో
విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు సోదాలు చేసినట్టు సిట్ వర్గాలు చెబుతున్నాయి. రేపో మాపో ఆయనకు సంబంధించి అదనపు ఛార్జిషీటు దాఖలు చేయనుంది. ఇంతలోనే సోదాలు జరగడంతో మిథున్‌రెడ్డి విషయంలో ఏం జరుగుతోందని ఆపార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
ALSO READ: నకిలీ బీరు.. నకిలీ మద్యం, జగనూ నువ్వే చేయించావా?
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సంబంధించిన పీఎల్ఆర్ సంస్థను ఐదు కోట్లు బదిలీ అయినట్టు ఆధారాలు లభించాయట. ఈ క్రమంలో సోదాలు జరిపినట్టు చెబుతున్నారు. మరోవైపు మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని కోరుతూ హైకోర్టుని సిట్ ఆశ్రయించింది కూడా. ఈ పరిణామాలు జరుగుతుండగానే సోదాలు చేపట్టడం వైసీపీ నేతల్లో కలకలం మొదలైంది.
మరోవైపు నకిలీ మద్యం కేసుపై సోమవారం సాయంత్రం సిట్ రంగంలోకి దిగింది. ఆ కేసు మరొక సిట్ దర్యాప్తు చేస్తోంది. దీనివెనుక సూత్రధారి మాజీ మంత్రి జోగి రమేష్ అంటూ సోమవారం నిందితుడు బయటపెట్టిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని సిట్ వర్గాలు భావిస్తున్నాయి.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సిట్ సోదాలు
హైదరాబాద్, బెంగళూరు నివాసాల్లో సిట్ సోదాలు
4 బృందాలతో తనిఖీ చేస్తున్న సిట్ అధికారులు
మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఆఫీసు సిబ్బందిని ప్రశ్నిస్తున్న అధికారులు
ఏపీ లిక్కర్ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి
71 రోజుల… pic.twitter.com/s5wAc2lp4R
— BIG TV Breaking News (@bigtvtelugu) October 14, 2025