Mamitha Baiju : ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటిస్తున్న తాజా చిత్రం డ్యూడ్.. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 17న దీపావళి సందర్భంగా ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇక హీరో హీరోయిన్లు పలు చానల్స్ కి ఇంటర్వ్యూ లిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ మమిత బైజు ఓ షాకింగ్ న్యూస్ ను బయటపెట్టింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..
‘ప్రేమలు’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకుంది మమిత బైజు.. చిన్న స్టోరీ తో ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లోకి వచ్చిన ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయానన్ని సొంతం చేసుకుంది.. ఆ తర్వాత ఈమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈమె డ్యూడ్ సినిమాలో నటిస్తుంది.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ దీపావళి సందర్భంగా థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మమిత సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.. ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను అని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ తనకు సవాలుగా అనిపించాయని, వాటి కోసం రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి, షూట్ సమయంలో కంగారుపడకుండా సీన్ పై మాత్రమే ఫోకస్ చేశానని ఆమె చెప్పింది.. అందుకే ఈ పాత్ర ఒకేసారి సవాలుగా, ఉత్సాహంగా అనిపించిందని పేర్కొన్నారు..
Also Read : నిహారిక – విశ్వక్ సేన్ రొమాంటిక్ సీన్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..
లవ్ టుడే, డ్రాగన్‌ల వంటి రెండు వరుస హిట్‌లను అందించిన ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ మూవీ స్టోరీ డిఫరెంట్ గా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఆడియన్స్ ఈ సినిమాను చూస్తూ థ్రిల్ అవుతారని అంటున్నారు. ఇందులో కురల్ చాలా నిజాయితీ గల పాత్ర. తన భావోద్వేగాల పట్ల నిబద్ధతగా ఉంటుంది, చుట్టూ ఉన్న వారందరితో స్నేహంగా ఉంటుంది. మొత్తానికి ఈ సినిమాలో కొత్తగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఇప్పటివరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రేమలు సినిమాతో యూత్ క్రష్ గా మారిపోయిన మమిత ఈ సినిమాతో ఎలాంటి క్రేజ్ ను అందుకుంటుందో చూడాలి.. దీపావళి సందర్భంగా బోలెడు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి ఈ మూవీ ఏ విధమైన రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి..