Mother Kills Childrenహైదరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సాయి లక్ష్మీ అనే మహిళ తమ పిల్లలను చంపి, భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. అనిల్, సాయిలక్ష్మీ అనే దంపతులకు కవల పిల్లలు చైతన్య, లాస్య పుట్టారు. వీరు పిఎంఆర్ అక్రేడ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. పిల్లలకు అనారోగ్య సమస్యలు రావడంతో వీళ్లిద్దరు తరచూ గొడవలు పడేవారు. తీవ్ర మనస్థాపానికి గురైన సాయిలక్ష్మీ.. భర్త అనిల్ ఉద్యోగానికి తర్వాత.. తన ఇద్దరి పిల్లలను హత్య చేసి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.