E-Paper
Advertisement

వైసీపీలో అంతర్గత విభేదాలా? బోరుగడ్డ ఫోన్ సంభాషణ ఆడియో లీక్, వెలుగులోకి కొత్త విషయాలు

వైసీపీలో అంతర్గత విభేదాలా? బోరుగడ్డ ఫోన్ సంభాషణ ఆడియో లీక్, వెలుగులోకి కొత్త విషయాలు
Advertisement

Tadepalli:  వైసీపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయా? జగన్ ఇంటి ముందు నిరసన తెలిపేందుకు మరికొందరు నేతలు రెడీ అవుతున్నారా? బోరుగడ్డ వ్యవహారం మిగతా నేతల్లో టెన్షన్ మొదలైందా? తాజాగా బోరుగడ్డ అనిల్‌కుమార్ ఫోన్ ఆడియో లీక్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోందా? దీంతో వైసీపీలో ఏం జరుగుతోందన్న ప్రశ్న అప్పుడే మొదలైంది.

వైసీపీలో అంతర్గత విభేదాలు?

 

Advertisement

వైసీపీలో ఇంటిపోరు మొదలైనట్టు కనిపిస్తోంది. మొన్నటివరకు మాకు తిరుగులేదని భావించిన నేతలు, ఇప్పుడు రోడ్ల మీద పడుతున్నారు. పార్టీ నుంచి వారికి ఎలాంటి సహాయం అందలేదని తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలతో వైసీపీలో తీవ్ర కలకలం రేపింది. వైసీపీ వీరాభిమాని బోరుగడ్డ అనిల్‌ దంపతులు మంగళవారం జగన్ ఇంటి ముందు నిరసనకు దిగడంతో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

 

బోరుగడ్డ అనిల్ వ్యవహారంతో లుకలుకలు

Advertisement

 

తాజాగా పార్టీ ఆఫీసుకు రావద్దని వైసీపీ పెద్దల నుంచి సమాచారం వచ్చినట్టు మీడియా ముందు చెప్పాడు బోరుగడ్డ అనిల్‌. మిగతా నేతల మాదిరిగా సపర్యలు చేయడం తన చేత కాదని తేల్చేశాడు. ఈ వ్యవహారం జరుగుతుండగానే బోరుగడ్డ అనిల్- వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి మధ్య ఫోన్ సంభాషణ పేరిట ఓ ఆడియో ఒకటి లీకైంది.

వైసీపీతో తనకు సంబంధం లేదని మీరు ఎందుకు చెప్పారని వైసీపీ అధికార ప్రతినిధిని బోరుగడ్డ అనిల్ ప్రశ్నించినట్టు ఉంది. ఏదైనా ఉంటే పార్టీ వాళ్లతో మాట్లాడుకోవాలని, తనకు సంబంధం లేదని అనిల్‌కు స్పష్టం చేశారు సదరు వ్యక్తి. తాను పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని, టీవీ డిబేట్లలో తనకు ఏమీ చెప్పలేదని అనిల్ చెప్పినట్టుగా ఉంది.

 

ఆడియో లీక్‌పై వైసీపీ నుంచి నో రెస్పాన్స్

 

ఇవే కాకుండా అందులో చాలా విషయాలు ఉన్నాయి. వారి పేరు మీద ఆడియో క్లిప్ సోషల్ మీడియా వైరల్ అవుతుంది.  ఆ క్లిప్‌పై వైసీపీ ఎలాంటి రియాక్ట్ కాలేదు. అది వారి మాటలా ? కాదా?  అనేది ఇంకా తెలియాల్సి వుంది. దీనిపై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. బోరుగడ్డ నిరసన తర్వాత ఆడియో లీక్ కావడంతో నిజంగా ఆయనకు సంబంధించినదేనని ఓ వర్గం అన్నట్లు గుసగుసలు లేకపోలేదు.

ఇక అసలు విషయానికి వద్దాం. జగన్ ఇంటి వద్ద బోరుగడ్డ దంపతులు నిరసనతో పార్టీలో సీనియర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టు వార్తలు వస్తున్నాయి. బోరుగడ్డకు ఈ పరిస్థితి ఏంటని, కావాలనే కేసులున్న నేతలను దూరం పెడుతున్నారా? అంటూ ఆ ఫ్యాన్ పార్టీలో అప్పుడే చర్చ మొదలై పోయింది.  రానున్నరోజుల్లో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

ALSO READ:  బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు

Related News

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

Big Stories

Advertisement
×