Gudivada Amarnath Comments:విశాఖ రాజకీయాల్లో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి.తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ వేదికగా 28,445 పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సంగతి తెల్సిందే.ఇక ఈ సందర్బంగా చంద్రబాబుపై అక్కడి సమస్యలని ఏకరువు పెడుతూ మాటల తూటాలు వదిలారు వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.
ఇంకెన్ని సార్లు కార్యక్రమాలు పెడతారు?
పేదల ఇళ్ల సమస్యతో పాటు నగరంలో కొనసాగుతున్న తాగునీటి ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు . ఇళ్ల పట్టాల పేరుతో ఇంకెన్ని సార్లు కార్యక్రమాలు పెడతారు?” పేదలకు నిజంగా ఇళ్ల స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇచ్చారా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విశాఖలో అసలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య తాగునీరు అని, ముందుగా ఆ విషయం పై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది అంటూ సెటైర్లు వేశాడు.
ఇక ఇళ్ల పట్టాల విషయంలోనూ మండిపడ్డారు అమర్నాథ్ తీవ్ర . గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం విషయంలో చర్యలు తీసుకుందని ఆయన గుర్తుచేశారు. గాజువాకలో హౌస్ కమిటీ సమస్యను పరిష్కరించామని, పేదల ఇళ్లకు హక్కులు కల్పించామని చెప్పుకొచ్చారు.
అమరావతి రియల్ ఎస్టేట్‌పై ప్రభావం
ఇక విశాఖ భూములపైనా సెన్సేషన్ కామెంట్స్ చేశారు అమర్నాథ్ . విలువైన ప్రభుత్వ భూములను తక్కువ ధరకే ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని ఆయన ఆరోపించారు. విశాఖ అభివృద్ధిని చంద్రబాబు,లోకేష్ అడ్డుకుంటున్నారని విమర్శించారు. విశాఖ వేగంగా అభివృద్ధి చెందితే అమరావతి రియల్ ఎస్టేట్‌పై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతోనే నగరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.అయితే ఈ అంశంపై గత ప్రభుత్వ రికార్డులలో ఉన్న విషయాలకి , ప్రస్తుత ప్రభుత్వ తీసుకునే నిర్ణయాల మధ్య తేడాలున్నాయన్న వాదనలు వినిపిస్తుండటం గమనార్హం.
ఇక ఎంపీ సీఎం రమేష్‌ను కూడా అమర్నాథ్ టార్గెట్ చేయడం విశేషం. పంచదార్ల ప్రాంతంలోని మైనింగ్ వ్యవహారంలో ఆయన హస్తం ఉందని ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు.పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ గతంలో ఆందోళనలు నిర్వహించింది కూడా .
అమర్ నాథ్ కౌంటర్ కి ఎలాంటి రియాక్షన్ వస్తుందో !
ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్‌పైనా ప్రశ్నల వర్షం కురిపించారు అమర్నాథ్ . లక్షల కోట్ల విలువైన సంస్థగా భావించే స్టీల్ ప్లాంట్ భవిష్యత్‌పై కార్మికులతో ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. విశాఖకు సంబంధించిన కీలక అంశాలను పక్కనపెట్టి రాజకీయ విమర్శలకు వేదికను ఉపయోగించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
మొత్తానికి విశాఖలో ఇళ్ల పట్టాల కార్యక్రమం మరోసారి టీడీపీ,వైసీపీ ల మధ్య మాటల యుద్దానికి దారి తీసింది.చూడాలి అమర్ నాథ్ కౌంటర్ కి ఎలాంటి రియాక్షన్ వస్తుందో !