House Site Pattas: ఇళ్ల పట్టాల పంపిణీ పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గోన్నారు. సీఎం సభా వేదిక మీదకు రాగానే లబ్దిదారులు, సభికుల నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. తమ స్థానాల్లో లేచి నిల్చొని సీఎం చంద్రబాబుకు చేతులు ఊపుతూ అభివాదం చేసారు. దీంతో అక్కడి ప్రజలు ఆనందంతో కేలు వేసారు.
సీఎం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ మీద నడుస్తూ ప్రజలకు చంద్రబాబు అభివాదం చేసారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గోన్నారు. మొత్తం 28,445 కుటుంబాలకు ఇళ్ల స్థలాలపై హక్కు కల్పిస్తూ సీఎం చంద్రబాబు పట్టాలు అందించారు. విశాఖలోని 11 మండలాల్లో 399 ఎకరాల భూమిని క్రమబద్ధీకరిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Also read: స్పామ్ కాల్స్, రోబో కాల్స్‌కు చెక్ పెట్టేలా TRAI మాస్టర్ ప్లాన్.. ఇకపై ఆ తప్పు చేస్తే అంతే సంగతులు!
మొత్తంగా 19,33,853 చదరపు గజాల స్థలం రెగ్యులరైజ్ చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను.. కానీ నేడు మీ మొహంలో ఆనందం చూస్తుంటే నా జీవితం ధన్యమైందని సీఎం అన్నారు. 11 మండలాలకు చెందిన 28,445 కుటుంబాలకు నిన్నటి వరకూ భూమి ఉన్నా.. దానిపై హక్కు ఉండేది కాదు. నేటి నుంచి మీరు ఉండే ఇంటిపై సర్వహక్కులు మీవేనని సీఎం తెలిపారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో జై బాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన సభికులు ఆనందం వ్యక్తం చేశారు.
Also read: రోజాకు ఇష్టమైన పొలిటీషియన్ తనేనా.. జగన్ కాదా? ఇదేమీ ట్విస్ట్ రా బాబు!