E-Paper
Advertisement

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు, హైదరాబాద్‌లో కూడా

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు, హైదరాబాద్‌లో కూడా
Advertisement

Weather Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ఫలితంగా ఏపీలో కురుస్తాయని అంచనా వేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. దీనికారణంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావం తెలంగాణపై ప్రభావం చూపనుంది.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

తెలంగాణలో రానున్న ఐదు రోజులు వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. బుధ, గురువారాల్లో అనేక ప్రాంతాల్లో జల్లులు కురుస్తాయని పేర్కొంది. వాటికితోడు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం తెలంగాణలో రోజంతా దట్టమైన మేఘాలు అలముకుంటాయి.

Advertisement

మధ్యాహ్నం తర్వాత వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో సాయంత్రం సమయంలో వర్షం పడే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ప్రయాణికులు, వాహనదారులకు వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకోవడం మంచింది. తెలంగాణలో రాత్రి 11 వరకూ వర్షం పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.

తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ప్రభావంతో బుధవారం ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లా, తూరు-పశ్చిమగోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Advertisement

మంగళవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం-9 సెంటీమీటర్లు, జోగినాథునిపాలెం-7.7, పెదబొడ్డేపల్లి-5.6, పెదఉప్పలం- 4.8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు అయ్యింది. వర్షం పడే సమయంలో పిడుగుల పడే అవకాశం ఉండడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గజపతినగరం, ఎస్ కోట, భీమునిపట్నం ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.

ALSO READ: తెలంగాణలో రైస్ మిల్లర్లకు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న మంత్రి ఉత్తమ్..!

Related News

వైసీపీ నేత విజయప్రసాద్ గుట్టు బయటకు.. చిట్టా విప్పిన ఈడీ, ఆనాటి నుంచి అజ్ఞాతంలో

చిక్కుల్లో బిగ్‌బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్.. విశాఖ పోలీసులు కేసు నమోదు, యువతి వ్యవహారమే..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మరి హైదరాబాద్‌లో

వైసీపీ ఫ్లెక్సీలో కేటీఆర్ ప్రత్యక్షం.. ఏలూరు ర్యాలీలో అసలేం జరుగుతోంది?

థాయ్‌లాండ్‌లో చిక్కుకున్న తెలుగు యువత.. రంగంలోకి దిగిన నారా లోకేష్!

డాక్టర్ ప్రియాంక అంత్యక్రియలు.. ఈ కష్టం ఏ తల్లిదండ్రులకు రాకూడదు!

పోలవరంపై కేంద్రం సంచలన ప్రకటన.. ఫేజ్-1కు మరో ఏడాది గడువు పెంపు!

పవిత్రమైన గోవింద నామాలపై పేరడీలా?.. పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం!

Big Stories

Advertisement
×