E-Paper
Advertisement

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!
Advertisement

AP Congress: ఆంధ్రరత్న భవన్‌‌లో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశ మైంది. PAC సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ PV మోహన్ హజరయ్యారు. Zoom కాల్ ద్వారా PAC సమావేశంలో APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పాల్గోన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటేందుకు రెడీగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవ్వాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అన్నారు. YSR రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని అనుకున్నారని, YSR ఆశయాన్ని నెరవేర్చేలా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పని చేయాలని అన్నారు.

TDP, YCP లపై..

ఈ దేశంలో కాంగ్రెస్ ఒక్కటే సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ అంటే సమానత్వం.. కాంగ్రెస్ అంటే లౌకిక వాదం ఈ దేశంలో పేదల పక్షాన నిలబడేది ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. యువతకు, మహిళలకు, అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు దక్కేది కాంగ్రెస్‌లో మాత్రమే అని షర్మిలా అన్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీలు, ప్రతి పక్ష YCP రెండు మోడీ తొత్తులే అని, TDP, YCP లపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని అన్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని, రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవ్వాల్సిన అవశ్యకత ఏర్పడిందని అన్నారు.

Advertisement

Also read: రీఛార్జ్ బాదుడుకి చెక్.. కేంద్రం సంచలన నిర్ణయం.. దెబ్బకు దిగిరానున్న ప్లాన్ల ధరలు!

స్ధానిక ఎన్నికల్లో..

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాల్సిన అవసరం ఉంది. పార్టీలో అంతర్గత గ్రూప్ రాజకీయాలకు స్వస్థి పలకాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొత్త ఎనర్జీతో పని చేయాలని, ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. ప్రతి ఒక్కరు లోకల్ బాడీ ఎన్నికలను బాధ్యతగా తీసుకోవాలని, మనకున్నది ఒకటే ఎజెండా.. అది కాంగ్రెస్ బలోపేతం మాత్రమేనని అన్నారు. పీవీ మోహన్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా రావడం హర్షణీయం అని అన్నారు. పీవీ మోహన్ సూచనలు, సలహాలతో పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని, పీవీ మోహన్ సీనియారిటీ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఉపయోగ పడుతుందని నమ్ముతున్నామని అన్నారు.

Advertisement

Also read: దీపావళికి ముందే రెండో వందే భారత్ స్లీపర్ ఎంట్రీ.. ఏ రూట్ లో పరుగులు తీస్తుందంటే?

Tags

Related News

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

వైసీపీకి చిచ్చుపెడుతున్న విజయసాయిరెడ్డి.. మా పార్టీ అసలైన రాయలసీమ రెడ్ల పార్టీ

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. వైసీపీ నేతలు షాక్

ట్రైన్‌పై ఓ వ్యక్తి నానాహంగామా.. ఆత్మహత్య చేసుకుంటానంటూ, రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రచ్చ

మెల్‌బోర్న్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు మృతి, షాకింగ్ ఫుటేజ్ వెలుగులోకి

భర్తను వదిలేసి బావ కొడుకుతో ఎఫైర్.. చివరకు ఏమైందంటే..

Big Stories

Advertisement
×