BigTV English

Jagan: టార్గెట్ లోకేష్.. మేం కూడా ‘బుక్’ రాయడం స్టార్ట్ చేశాం, ఆ పేర్లు ఉంటాయ్: మంగళగిరిలో జగన్ కామెంట్స్

Jagan: టార్గెట్ లోకేష్.. మేం కూడా ‘బుక్’ రాయడం స్టార్ట్ చేశాం, ఆ పేర్లు ఉంటాయ్: మంగళగిరిలో జగన్ కామెంట్స్

Jagan Comments on CM Chandrababu and Minister Lokesh: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..


‘ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు, కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని భావించి, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికారంలో ఉన్నవాళ్లు అధికార దుర్వినియోగంతో కార్యకర్తలకు నష్టంచేస్తున్నప్పుడు ఖచ్చితంగా భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది. పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసాన్ని వారికి కల్పిస్తున్నాను.

Also Read: ట్రాప్‌లో పడ్డ తమ్ముళ్లు.. వైసీపీ ‘శ్యామలా’ ప్లాన్ సక్సెస్, ఇప్పటికైనా మారతారో లేదో!


ఇప్పటికే మనం ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నాం. కోవిడ్ లాంటి మహమ్మారినే ఎదుర్కొన్నాం. ఆ సమయంలో విపరీతంగా ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తాయి. అయినా కూడా ఏరోజు సాకులు చూపకుండా పథకాలను విజయవంతంగా అమలు చేయగలిగాం. రాష్ట్రంలోని ప్రతి ఊరికి మంచి స్కూళ్లను కట్టించాం. మంచి వైద్యాన్ని తీసుకువచ్చేందుకు ఆసుపత్రులను ఏర్పాటు చేశాం. వ్యవసాయ రంగంలో పలు మార్పులు తీసుకువచ్చాం. ఎటువంటి వివక్ష చూపుకండా పథకాలను అందరికీ అమలు చేశాం. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయి.

కానీ, ప్రస్తుత కూటమి పాలనలో అలాంటి పరిస్థితి లేదు. గవర్నమెంట్ స్కూళ్లను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ అన్నమాటే లేదు. వాటికి బిల్లులు చెల్లించడంలేదు. ఆరోగ్య ఆసరాను ఎగరగొట్టేశారు. వైద్యం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది.

కష్టాల నుంచే నాయకులు పుడుతారు..

ప్రస్తుతం మనం ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాల నుంచే నాయకులు పుడుతారు. కష్టాలు ఎక్కువ కాలం ఉండవు. గతంలో నన్ను ఏకంగా 16 నెలలు జైలులో పెట్టి ఎంతో వేధించారు. అయినా ప్రజల ఆశీస్సులతో మనం ముందడుగు వేయగలుగుతున్నాం. నేతలు, కార్యకర్తలు ఏ మాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా ముందడుగు వేయాలి. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వాటి పరిష్కారం దిశగా పనిచేయాలి.

Also Read: ఇంద్రకీలాద్రిలో ఈసారి ఇది ఏర్పాటు చేశాం.. ఇక భక్తులకు ఎలాంటి ఆందోళన అవసరంలేదు: చంద్రబాబు

గుడ్ బుక్ రాసుకోవడం స్టార్ట్ చేశాం..

రెడ్ బుక్ అనేది అదేమైనా పెద్దపనా..? ఇప్పుడు నేను వద్దని చెప్పినా మా వాళ్లు కూడా బుక్స్ ను మెయింటెన్ చేస్తున్నారు. అన్యాయం చేసేవారి పేర్లను, అటువంటి అధికారుల పేర్లను వారు అందులో రాసుకుంటున్నారు. అదేవిధంగా మేం కూడా గుడ్ బుక్ రాసుకోవడం స్టార్ట్ చేశాం. పార్టీ కోసం ఎవరైతే కష్టపడుతారో వారి పేర్లను క్లుప్తంగా పరిశీలించి అందులో రాసుకుంటున్నాం. భవిష్యత్ లో వారికి తప్పకుండా మంచి అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయి’ అంటూ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×