BigTV English

CM Chandrababu: ఇంద్రకీలాద్రిలో ఈసారి ఇది ఏర్పాటు చేశాం.. ఇక భక్తులకు ఎలాంటి ఆందోళన అవసరంలేదు: చంద్రబాబు

CM Chandrababu: ఇంద్రకీలాద్రిలో ఈసారి ఇది ఏర్పాటు చేశాం.. ఇక భక్తులకు ఎలాంటి ఆందోళన అవసరంలేదు: చంద్రబాబు

CM Chandrababu Visited Vijayawada Kanaka Durga Temple: దసరా ఉత్సవాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు విజయవాడ ఇంద్రకీలాద్రిని సందర్శించారు. అనంతరం కనకదుర్గా దేవీకి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పండితులు, ఆలయ అధికారులు భారీగా స్వాగతం పలికారు. పూజా కార్యక్రమం అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. చంద్రబాబు వెంట మంత్రి లోకేశ్ దంపతులు కూడా ఉన్నారు.


Also Read: ట్రాప్‌లో పడ్డ తమ్ముళ్లు.. వైసీపీ ‘శ్యామలా’ ప్లాన్ సక్సెస్, ఇప్పటికైనా మారతారో లేదో!

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘తిరుమల తిరుపతి తరువాత ఇంద్రకీలాద్రి రెండో అతిపెద్ద దేవాలయమని అన్నారు. దేవాలయాల్లో పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు, దుర్గమ్మ భక్తులందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే.. మూలా నక్షత్రం రోజు దుర్గమ్మను దర్శించుకోవడం నా అదృష్టం. లక్షల సంఖ్యలో భక్తులు విజయవాడ ఇంద్రకీలాద్రీ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వారందరికీ మంచి జరిగేలా చూడాలని, మేం చేస్తున్న మంచి పనులను ఆశీర్వదించాలను దుర్గమ్మను వేడుకున్నాను.


ఈసారి ఇక్కడ సేవా కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ ద్వారా అనేక రకాల సేవలను భక్తులకు అందిస్తున్నాం. దుర్గగుడి పాలక మండలి సభ్యులకు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నాను. చాలా చక్కగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పిస్తున్నారు. క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. అందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇందుకోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఎంతగానో శ్రమించారు.

Also Read:  కమలాపురంలో వైసీపీ ఖాళీ.. జగన్ మేనమామ రవీంద్రనాథ్‌కు టీడీపీ ఝలక్

ఇంద్రకీలాద్రీపై వీఐపీ భక్తులు కూడా సహకరిస్తున్నారు. వారంతా కూడా దుర్గగుడి సన్నిధిలో సౌకర్యాలు బాగున్నాయంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రశంసలు తెలియజేస్తున్నారు. భక్తుల మనోభావాలకు తగ్గట్టుగానే మా ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఉంటాయి. రాష్ట్రంలో ప్రతి దేవాలయానికి పూర్వ వైభం తీసుకువచ్చేందుకు కృషి చేస్తాను. ఈసారి రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయి. అది కేవలం దుర్గమ్మ దేవత దయవల్లే. అమ్మవారి దయతో రాష్ట్రంలో నదుల అనుసంధానం కూడా పూర్తివ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తవ్వాలని అమ్మవారిని వేడుకుంటున్నాను’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×