E-Paper
Advertisement

Janasena : పవన్‌ను ఇరికిస్తున్న జనసైనికులు!

Janasena : పవన్‌ను ఇరికిస్తున్న జనసైనికులు!
Advertisement

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రేజ్ నానాటికీ మసకబారుతున్నట్టు తెలుస్తున్నది. అందుకు ఆయన పాలనా పరమైన లోపం అనుకున్నట్టే పొరపాటే.. పవన్ ఓవైపు పాలనపై పట్టు సాధిస్తూనే మరోవైపు తన శాఖలకు న్యాయం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.గ్రామీణ, గిరిజన, కొండప్రాంతాల్లో రోడ్లు వేయిస్తూ గత ప్రభుత్వాలు చేయలేని వాటిని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. మరోవైపు సినిమాలు చేస్తూనే వృత్తి ధర్మానికి న్యాయం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన కమిట్మెంట్ ఆధారంగా సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఇదిలాఉండగా, జనసేన పార్టీకి వెన్నుదన్నుగా ఉండి పార్టీకి మైలేజ్ పెంచాల్సిన కొందరు నేతలే పక్కలో బల్లెంలా మారారు.

విమర్శలు, డ్యామేజ్..

జనసేన పార్టీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ అంటే కొండంత అభిమానం వారిలో ఉన్నది. వీరిలో కొందరు జనసేన జెండా మోస్తుంటే మరికొందరు జెండా మోయకున్నా వీరాభిమానులుగా కొనసాగుతున్నారు. కాగా, కొందరు నేతలు, వారి కేడర్ చేసే పనుల వలన మొత్తం పార్టీకే చెడ్డపేరు వస్తున్నదని జనసేన సీనియర్ నేతలు అంటున్నారు. ఇటీవల తిరుపతి జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వ్యవహారం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. జనసేన నుంచి తొలిసారి పోటీ చేసి గెలిచిన ఆరవ శ్రీధర్.. ఓ రైల్వే మహిళా ఉద్యోగినిని బుట్టలో వేసుకుని పెళ్లి పేరుతో మోసం చేశారని బాధితురాలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసులో విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తున్నది. అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో స్పందించకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది.

మీకో రూల్.. బయట వారికి మరో రూలా?

Advertisement

ఆరవ శ్రీధర్ ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే ఆయన బయటకు రావడం లేదు. ముందస్తు బెయిల్ మీద బయటే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తమ ఎమ్మెల్యే తనను మోసం చేశారని ఓ వివాహిత పీఎస్‌లో ఫిర్యాదు చేస్తే పోలీసు యంత్రాంగం సైతం పట్టించుకోలేదని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తున్నది. కాగా, జనసేన ఎమ్మెల్యేను.. పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఎందుకు బహిష్కరించలేదు.. కనీసం సస్పెండ్ కూడా చేయలేదని పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో వైసీపీ హయాంలో ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పవన్ .. తన పార్టీ ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలు వచ్చినా ఎందుకు చర్యలకు ఆదేశించడం లేదని.. తన పార్టీ వారికి ఒక రూల్.. బయట వారికి మరో రూల్ అని ప్రశ్నిస్తున్నారు.

అసిస్టెంట్ పై కొమురక్క లైంగిక వేధింపులు.. దాడి ఘటనతో బయటపడ్డ నిజాలు!

Advertisement

ఇదిలాఉండగా, ఆరవ శ్రీధర్ తనపై లైంగిక దాడి చేశారని, పెళ్లి పేరుతో మోసం చేశారని ఆరోపిస్తున్న వివాహితపై జనసేన పార్టీ నేత తాతంశెట్టి నాగేంద్ర శుక్రవారం ఉదయం దాడులకు పాల్పడినట్టు తెలుస్తున్నది. పోలీసు లాఠీతో విచక్ణణా రహితంగా అందరి ముందే దాడులు చేసినట్టు సమాచారం.. పోలీసులు పక్కనే ఉన్నా చోద్యం చూస్తున్నట్టు తెలిసింది. బాధితురాలిని ఇష్టానుసారంగా తిడుతూ, జుట్టుపట్టుకుని కొట్టారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నట్టు తెలుస్తోంది..మరి ఈ ఘటనపై డిప్యూటీ సీఎం స్పందిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉన్నది.ఒకవేళ పవన్ ఈ ఘటనపై చర్యలు తీసుకోకపోతే జనసేన పార్టీపై చెడు అభిప్రాయం ఏర్పడటమే కాకుండా, వచ్చే స్థానిక ఎన్నికల్లో పెద్ద దెబ్బ పడటం ఖాయమని చర్ జరుగుతున్నది. ఇప్పటికైనా పవన్ వెంటనే స్పందించి.. తప్పు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలకు ఆదేశించాలని జనసైనికులు, ఏపీ ప్రజలు కోరుతున్నారు.

Related News

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×