BigTV English

Kakani Govardhan: టీడీపీ అధికారంలో వైసీపీపై దాడులు పెరిగాయి: కాకాణి గోవర్ధన్

Kakani Govardhan: టీడీపీ అధికారంలో వైసీపీపై దాడులు పెరిగాయి:  కాకాణి గోవర్ధన్

Kakani Govardhan: ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ ఆరోపించారు. కూటమి పాలనలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయన్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. అంతే కాకుండా నడి రోడ్డుపై రషీద్‌ను దారుణంగా హతమార్చారు. వ్యక్తిగత వివాదాలే అతడి హత్య జరిగిందని చెప్పడం దారుణం. రషీద్ హత్యపై ఎస్పీ తీరు సరికాదు. రషీద్‌ను హత్య చేసిన వ్యక్తి పేరు జిలానీ. అతడు టీడీపీకి చెందిన కార్యకర్త, రసీద్ హత్యకు సూత్రదారులను పోలీసులు గుర్తించాలని కాకాణి అన్నారు.


మాజీ లోక్ సభ సభ్యుడు రెడ్డెప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి వెళితే టీడీపీ నేతలు అతడిపై దాడులకు పాల్పడ్డారు. చివరకు మాథున్ రెడ్డి గన్‌మెన్లు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగాయి. మూడు వేల కుటుంబాలు గ్రామాలను వదిలి వలస వెళ్లారని ఆరోపణలు చేశారు.

Also Read: పిన్నెల్లికి హైకోర్టులో షాక్.. బెయిల్ నిరాకరణ


రాష్ట్రంలో మహిళలు, మైనర్లలపై అఘాయిత్యాలు కూడా అధికమయ్యాయి. ఈ ఘటనపై హోంమంత్రి అనిత మాటలు చూసి ఎంతో మురిసిపోయారు. కానీ ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో కూడా కనబడటం లేదు. వైసీపీ నేతల మీద దాడులు జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు 40 రోజుల పాలనలో ఎన్నో దారుణాలు జరిగాయి. పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. వైసీపీ నేతలను భయపెట్టి లొంగదీసుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. మంచి పాలన ఇస్తారేమో అనుకున్నాం కానీ ఇదేనా వీళ్లు చేస్తున్న పాలన అని ప్రశ్నించారు.

Tags

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×