E-Paper
Advertisement

Janhvi Kapoor: హాస్పిటల్ లో జాన్వీ కపూర్.. ఆందోళనలో ఫ్యాన్స్

Janhvi Kapoor: హాస్పిటల్ లో జాన్వీ కపూర్.. ఆందోళనలో ఫ్యాన్స్
Advertisement

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హాస్పిటల్ లో చేరింది. ఆమెకు ఫుడ్ పాయిజన్ కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ముంబైలోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో చేర్పించారు. ఈ విషయాన్నీ జాన్వీ తండ్రి బోనీ కపూర్ నిర్దారించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, 2 రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిపారు.

ఇక ఈ విషయం తెలియడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ కావడంతో జాన్వీ బాగా ఇబ్బందిపడుతుండడంతోనే హాస్పిటల్ వరకు వెళ్లాల్సివచ్చిందని తెలుస్తోంది. వైద్యులు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నారని, ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె సన్నిహితులు చెప్పుకొస్తున్నారు.

Advertisement

ఇక జాన్వీ కెరీర్ విషయానికొస్తే తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే దేవర సినిమాతో అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే RC16 సినిమాలో ఛాన్స్ పట్టేసింది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ.. ఈ మధ్యనే నాని సినిమాను కూడా ఫైనల్ చేసిందని వార్తలు వస్తున్నాయి.

ఇంకోపక్క హిందీలో ఉలాజ్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మధ్యనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి మంచి హైప్ నే తీసుకొచ్చింది. జాన్వీ హాస్పిటల్ వార్త విన్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×