Rain Alert In AP: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వాతావరణం అమాంతంగా మారిపోయింది. ఇది వాయిగుండంగా మారే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సోమవారం నుంచి ఏపీతోపాటు తెలంగాణల్లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. శనివారం సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. నైరుతి రుతుపవన ఉపసంహరించుకోవడం ప్రారంభమైంది. దీంతో దక్షిణ భారత్‌లోని తొమ్మిది రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. వాతావరణ శాఖ అంచనాల మేరకు.. అండమాన్ సముద్రంపై అల్పపీడనం ఏర్పడింది. ఇది సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
ఇది సెప్టెంబర్ 23 ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని చేరేలోపు అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. దీని కారణంగా ఏపీ-ఒడిశాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. దీనికారణంగా ఒడిశాలోని బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రపారా, జగత్‌సింగ్‌పూర్, కటక్, ధెంకనల్, పూరీ, ఖుర్దా, నయాగర్ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముంది. ఏపీ, తెలంగాణతోపాటు సెంట్రల్ మహారాష్ట్ర, మరఠ్వాడా, కొంకణ్-గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళలో వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ కావడంతోపాటు బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముంది. ఏపీ, తెలంగాణతోపాటు సెంట్రల్ మహారాష్ట్ర, మరఠ్వాడా, కొంకణ్-గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళలో వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ కావడంతోపాటు బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావంతో సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ALSO READ: ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!
ఆదివారం రోజు ఏపీ, తెలంగాణల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఇలాంటి మయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో తీరప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేసింది.