E-Paper
Advertisement

Minister Lokesh: నా కుటుంబంతో పోటీ పడటం.. ఎన్నికల కంటే కష్టం.. లోకేశ్ ఫన్నీ ట్వీట్

Minister Lokesh: నా కుటుంబంతో పోటీ పడటం.. ఎన్నికల కంటే కష్టం.. లోకేశ్ ఫన్నీ ట్వీట్
Advertisement

Minister Lokesh: ఏపీ సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. ప్రముఖ ఇంగ్లిష్ మీడియా సంస్థ ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ ఈ అవార్డును ప్రకటించింది. తన తండ్రితో సహా కుటుంబ సభ్యులకు వచ్చిన అవార్డుల గురించి ప్రస్తావిస్తూ మంత్రి లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

‘మా నాన్న బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. అమ్మ భువనేశ్వరి ‘గోల్డెన్ పీకాక్’ అవార్డును ఇంటికి తీసుకువస్తున్నారు. భారతదేశంలోని ‘వ్యాపారంలో అత్యంత శక్తివంతమైన మహిళలలో’ నా సతీమణి బ్రాహ్మణి ఒకరు. నా కుటుంబంతో పోటీ పడటం ఎన్నికలకన్నా కష్టంగా ఉంది’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.

ఫ్యామిలీతో పోటీ

Advertisement

తన కుటుంబంలో ప్రతీ ఒక్కరూ ఆయా రంగాల్లో విశేష ప్రతిభతో అవార్డులు పొందారని మంత్రి లోకేశ్ అన్నారు. వారితో పోటీ పడడం ఎన్నికల పోటీ కంటే కష్టంగా మారిందని అంటూ ఫన్నీ ట్వీట్ చేశారు. నిత్యం తన ఫ్యామిలీతో పోటీ పడుతున్నట్లు అన్నారు. అంతకు ముందు మరో ట్వీట్ లో సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకమైన అవార్డు వచ్చిందని ప్రకటించారు.

గర్వకారణమైన క్షణం

“మా కుటుంబానికి, ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణమైన క్షణం. సీఎం చంద్రబాబుకు ఎకనమిక్స్ టైమ్స్ ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ప్రకటించింది. భారతదేశంలో సంస్కరణలను స్పష్టత, ధైర్యం, స్థిరత్వంగా కొంతమంది నాయకులు మాత్రమే కొనసాగించారు. పాలనలో సంస్కరణలు, వేగం చూపిన సీఎం చంద్రబాబు అచంచల దూరదృష్టికి ఈ అవార్డు నివాళి” అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.

Advertisement

Also Read: Chandrababu Naidu: డాక్టరేట్ తిరస్కరించా.. ‘రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుపై స్పందించిన చంద్రబాబు

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×