E-Paper
Advertisement

విశాఖకు ఐబీఎం రిటర్న్.. మరో దిగ్గజ కంపెనీ రాక, కొత్త క్యాంపస్ కోసం ప్రభుత్వంతో చర్చలు

విశాఖకు ఐబీఎం రిటర్న్..  మరో దిగ్గజ కంపెనీ రాక, కొత్త క్యాంపస్ కోసం ప్రభుత్వంతో చర్చలు
Advertisement

Vizag: విశాఖ సిటీని గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రపంచంలోని టాప్ కంపెనీలకు అక్కడికి రప్పించే పనిలో నిమగ్నమైంది. లేటెస్ట్‌గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐటీ సంస్థ ఐబీఎం విశాఖలో అడుగుపెట్టింది. లాన్సమ్ స్క్వేర్ తన ఆఫీసుని ఏర్పాటు చేసింది. దీనిపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

విశాఖకు ఐబీఎం మళ్లీ రాక.. ఆఫీసు ప్రారంభం

Advertisement

ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ఐటీ కంపెనీలు విశాఖపై ఫోకస్ చేశాయి. గ్లోబల్‌ ఐటీ హబ్‌గా అడుగులు వేస్తోంది విశాఖ నగరం. గూగుల్‌, ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌ వంటి ఐటీ కంపెనీలు అక్కడ అడుగుపెట్టాయి. తాజాగా మరో ఐటీ కంపెనీ విశాఖలో రీఎంట్రీ ఇచ్చింది. ఐబీఎం కంపెనీ విశాఖలో తన కార్యాలయాన్ని ఓపెన్ చేసింది.

ఇసుకతోట జంక్షన్‌లోని లాన్సమ్‌ స్క్వేర్ ఆఫీసులో ఐబీఎం కొత్త ఆఫీసుని ఏర్పాటు చేసింది. iSprout భాగస్వామ్యంతో ఐబీఎం కార్యకలాపాలు నిర్వహించనుంది ఐబీఎం. ప్రస్తుతం 500 మందికి పైగానే ఉద్యోగులు అక్కడ పని చేస్తున్నారు. సొంత క్యాంపస్‌ ఏర్పాటుకు భూమి కేటాయించాలని ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఐబీఎం కోరింది.

Advertisement

కొత్త క్యాంపస్ కోసం ప్రభుత్వంతో ఆ సంస్థ చర్చలు

ఒకవిధంగా చెప్పాలంటే గతంలో ఐబీఎం విశాఖలో కార్యకలాపాలు నిర్వహించేది. కాకపోతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనక్కి వెళ్లిపోయింది. మళ్లీ కూటమి ప్రభుత్వంలో సాగర తీరంలోకి ఎంట్రీ ఇచ్చింది ఆ ఐటీ కంపెనీ. ఐబీఎం కొత్త క్యాంపస్ ఏర్పాటు భూమి కేటాయించేందుకు సిద్ధమైనట్టు అధికారులు చెబుతున్నమాట.

ఐబీఎం లాంటి సంస్థలు రావడం విశాఖకు శుభపరిణామంగా వర్ణిస్తున్నారు. దీనివల్ల యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. మరోవైపు విశాఖలో ఐబీఎం తన ఆఫీసును ఏర్పాటు చేయడంపై మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ కంపెనీని స్వాగతిస్తున్నామంటూ రాసుకొచ్చారు.

ALSO READ: 60 టన్నుల ట్యాంకర్ ప‌డి కారు నుజ్జునుజ్జు.. సీసీ ఫుటేజీలో బయటపడ్డ అస‌లు నిజం!

#ChooseSpeedChooseAP హ్యాష్ ‌ట్యాగ్‌తో ఆయన ట్వీట్ చేశారు. ఐబీఎం రాకతో విశాఖ సిటీకి ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం ఆలోచన. అమరావతిలో క్వాంటమ్‌ హబ్‌ ఏర్పాటు వేగంగా అడుగులు పడుతున్నాయి.

 

Related News

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ బరిలో వంగవీటి రాధాకృష్ణ

పల్నాడులో హైటెన్షన్‌.. వైసీపీ కీలక నేతల హౌస్‌ అరెస్ట్‌.. ఆంక్షలపై రాజకీయ దుమారం!

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

Big Stories

Advertisement
×