E-Paper
Advertisement

Nara Lokesh Mass Speech: కుర్చీ మడతపెడితే.. నారా లోకేశ్ మాస్ డైలాగ్..

Nara Lokesh Mass Speech: కుర్చీ మడతపెడితే.. నారా లోకేశ్ మాస్ డైలాగ్..
Advertisement
Nara Lokesh Mass Speech

Nara Lokesh Mass Speech(Andhra pradesh political news today): తెలుగుదేశం కార్యకర్తలు జోలికి వైసీపీ నేతలు వస్తే తగ్గేదేలే అని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. నెల్లిమర్లలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన ప్రసంగించారు. కుర్చీ మడతపెట్టీ జగన్‌కు సీఎం కుర్చీలేకుండా చేస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. శాంపిల్‌గా ఓ కుర్చీని మడతపెట్టీ మరీ చూపించారు. దీంతో తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు సభ ప్రాంగణం దద్దరిల్లేలా నినాదాలు చేశారు.

రాజధాని ప్రాంత రైతులంటే సీఎంకు భయమని లోకేశ్ అన్నారు. రాజధాని ఫైల్స్ సినిమా అంటేనే జగన్‌కు భయమేస్తుందని అన్నారు. అందుకే ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకు వద్దకు పోలీసులను పంపారన్నారు. ఉన్న రాజధాని నగరాన్ని కాదని మూడు రాజధానులన్నారన్నారు. కనీసం ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకైనా వేశారా అని ప్రశ్నించారు. ఇలాంటి డ్రామాలకు ప్రజలే బుద్ధిచెప్తారన్నారు.

Advertisement

Read More: ఆధ్యాత్మిక సేవలో చంద్రబాబు.. నివాసంలో రాజశ్యామల యాగం..

మద్యపాన నిషేధమన్నారని.. నిషేధం విధించాకే ఓటు అడుగుతాన్నారని.. ఇప్పుడే ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని జగన్ ను నారా లోకేశ్ ప్రశ్నించారు. ఐదేళ్లుగా ప్రతీ రంగంలో రాష్ట్రాన్ని దోచుకున్నారని స్పష్టం చేశారు. సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ సీఎం జగన్‌కు గుర్తులేదని ఎద్దేవా చేశారు. విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలను పెంచిన ప్రభుత్వం అవసరమా అని ప్రశ్నించారు.

Tags

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×