BigTV English

Ravichandran Ashwin : 500 వికెట్ల క్లబ్ లో రవిచంద్రన్ అశ్విన్.. టెస్టుల్లో కొత్త రికార్డు..

Ravichandran Ashwin : 500 వికెట్ల క్లబ్ లో రవిచంద్రన్ అశ్విన్.. టెస్టుల్లో కొత్త రికార్డు..

Ravichandran Ashwin New Record (sports news today) :


భారత్ స్పిన్నర్ మరో రికార్డు బద్దలు కొట్టాడు. టెస్టుల్లో 500 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ జాక్ క్రాలీ అవుట్ చేసి ఈ ఘనత సాధించాడు. 98వ టెస్టులో ఈ మైలురాయిని చేరుకున్నాడు.

విశాఖ జరిగిన రెండో టెస్టులో అశ్విన్ ఈ ఘనత సాధిస్తాడని భావించారు. కానీ ఆ మ్యాచ్ ముగిసే సరికి 500 వికెట్లకు ఒక అడుగు దూరంలో నిలిచాడు. రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో మొదటి వికెట్ ను పడగొట్టి అశ్విన్ అరుదైన ఘనతను అందుకున్నాడు. జాక్ క్రాలీ ఇచ్చిన క్యాచ్ రజత్ పటీదార్ పట్టుకోవడంతో అశ్విన్ ఆనందంతో గంతేశాడు.


తక్కువ బంతుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్ల జాబితా అశ్విన్ రెండోస్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ టాప్ లో ఉన్నాడు. మెక్ గ్రాత్ 25, 528 బంతులు వేసి.. 500 వికెట్ల మార్కు అందుకున్నాడు. ఆ తర్వాత రెండోస్థాన్ భారత్ టాప్ స్పిన్నర్ అశ్విన్ నిలిచాడు. అశ్విన్ 25,714 బంతులు వేసి.. 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.

Read More: భారత్ 445 ఆలౌట్.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ షురూ..

ఇంగ్లాండ్ వెటనర్ ఫాస్ట్ బౌలర్ల జేమ్స్ అండర్సన్ 28, 150 బంతుల్లో 500 వికెట్ల క్లబ్ లో చేరి 3వ స్థానంలో నిలిచాడు.. ఇంగ్లాండ్ కే చెందిన మరో ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 28,430 బంతుల్లో 500 వికెట్లు తీశాడు. వెస్టిండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ కోట్నీ వాల్ష్ 500 వికెట్లు పడగొట్టడానికి 28, 833 బంతులు వేశాడు.

టాప్ -5లోని ఉన్న బౌలర్లలో అశ్విన్ ఒక్కడే స్పిన్నర్. మెక్ గ్రాత్, అండర్సన్, బ్రాడ్, వాల్ష్ నలుగురు పేసర్లు. ఇలా అతి తక్కువ బంతుల్లో 500 వికెట్లు తీసిన స్పిన్నర్ గానూ అశ్విన్ మరో రికార్డు కూడా సృష్టించాడు.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×