Metro Pillar: మెట్రోలో అడుగడుగునా నిర్లక్ష్యం. ప్రజల ప్రాణాలంటే ఏమాత్రం లెక్కలేనితనం. ఇస్కాన్ టెంపుల్ దగ్గర పిల్లర్ల చుట్టూ గుంతలు తవ్వడంపై BIG TV సాహసోపేత కథనాలు ప్రసారం చేసింది. చేస్తోంది. మొత్తానికి.. ఈ వ్యవహారంపై అధికారులు కళ్లు తెరిచారు. పిల్లర్ల చుట్టూ గుంతలు తవ్వడంపై స్పందించారు. మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌కు నోటీసులు ఇచ్చారు. పనులకు ఎలాంటి పర్మిషన్ లేదని బిగ్ టీవీ లైవ్‌లో తెలిపారు MMC DC.
MMC కమిషర్ వినయ్ కృష్ణారెడ్డి కూడా దీనిపై స్పందించారు. BIG TV కథనాలతోనే.. ఇస్కాన్ టెంపుల్ దగ్గర మెట్రో పిల్లర్ల చుట్టూ తవ్వకాల్ని ఆపేశామన్నారు. HMRLకి నోటీసులు ఇచ్చామని, మెట్రో నుంచి రిప్లై వచ్చాక, తదుపరి చర్యలుంటాయన్నారు. అధికారులు నోటీసులు ఇచ్చారు కానీ… పిల్లర్ల చుట్టూ గుంతలు తవ్వింది ఎవరనేది మాత్రం స్పష్టత లేదు. నోటీసుల్లో క్లియర్‌గా UNKNOWN పర్సన్ అని రాశారు. గుర్తు తెలియని మనుషులు గుంతలు తవ్వుతుంటే… మెట్రో అధికారులు నిద్రపోతున్నారా? నిత్యం మానిటర్ చేయాల్సిన HMRL ఏం చేస్తోంది? ఎవరికి కొమ్ము కొస్తోంది?
Also read: వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు
అసలు ఈ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు? ఇంత జరుగుతున్నా మెట్రో ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదు? లాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. మెట్రో కుంభకోణంపై BIG TV కథనాలతోనే కాంట్రాక్టర్లు, అధికారుల్లో వణుకు మొదలైంది. ఇన్నాళ్లూ మొద్దునిద్రపోయిన అధికారులు.. బిగ్ టీవీ కథనాలతో కళ్లు తెరిచారు. మొన్నటివరకు కనిపించిన గోతులు.. ఇప్పుడెందుకు కనిపించకుండా పోయాయి? BIG TV కథనాల తర్వాతే కవరింగ్ పనులు మొదలయ్యాయనేది స్పష్టంగా తేలిపోయింది.