E-Paper
Advertisement

TDP : పోలవరం పాలిటిక్స్.. టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు..

TDP : పోలవరం పాలిటిక్స్.. టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు..
Advertisement

Polavaram latest news telugu(AP politics) : టీడీపీ నేతలు చేపట్టిన పోలవరం యాత్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రాజెక్టు వద్దకు వెళుతుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. కొందరు టీడీపీ నేతలు ఏలూరు నుంచి గోపాలపురం మీదుగా పోలవరం బయలుదేరారు. అయితే వారిని కొవ్వూరుపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

Advertisement

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, గన్ని వీరాంజనేయులు, బడేటి రాధాకృష్ణతోపాటు మరికొందరు పార్టీ నేతలను పోలీసులు ఆపేశారు. దీంతో టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా టీడీపీ నేతలు ప్రతిఘటించారు. దీంతో టీడీపీ నేతలను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు.

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలీసుల కళ్లుగప్పి బైక్ పై పోలవరం వైపు బయలేదారు. అయితే ఆయను పోలీసులు అదుపులోకి తీసుకుని కొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మిగిలిన టీడీపీ నేతలను గోపాలపురం పీఎస్ కు తరలించారు. మరోవైపు పోలవరం వద్ద పోలీసులు భారీగా సిబ్బందిని మోహరించారు.

Related News

ఏపిలో కొత్త పింఛన్ల దారులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

ఉప్పాడ తీరంపై పవన్ ఫోకస్.. గ్రౌండ్‌లోకి ఐఐటీ మద్రాస్ టీమ్

ఏపీ డీఎస్సీలో మరో భారీ స్కామ్ బట్టబయలు.. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లకు టీచర్ ఉద్యోగాలు!

రావులపాలెంలో దంపతుల సూ*సైడ్.. అసలు ట్విస్ట్ ఇదే!

వైఎస్సార్ కుటుంబంలో పెళ్లి సందడి.. షర్మిల కుమార్తెకు వివాహం నిశ్చయం.. వరుడు ఎవరంటే?

డీఎస్సీలో అక్రమాలే కాదు పేపర్ కూడా లీక్.. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సంచలనం

బిగ్ టీవీకి సపోర్ట్‌గా రాజన్నదొర.. జగన్ ఆదేశిస్తే పోరాటమే!

ఏపీ మెగా డీఎస్పీలో ప్రకంపనలు.. జనసేన-బీజేపీల సైలెంట్ వెనుక స్టాండ్ ఏంటి?

Big Stories

Advertisement
×