Indication of Human Life : మనిషి పుట్టుక అనేది శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే చాలా పాతది అని ఇప్పటికీ పలువురు నిపుణులు వాదిస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా పలు ఆనవాళ్లు కూడా వారికి దొరుకుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఆనవాళ్లు ఎన్నో ప్రాంతాల్లో ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలో అలాంటివి బయటపడ్డాయి. ఆస్ట్రేలియాలో శాస్త్రవేత్తలకు దొరికిన ఆనవాళ్లు చూస్తుంటే ఇవి కచ్చితంగా పాతకాలం మనుషులకు సంబంధించినవే అని వారు భావిస్తున్నారు.
ఆస్ట్రేలియాలోని పలు పాత రాళ్ల మీద బిలియన్ ఏళ్ల క్రితానికి చెందిన మనుషుల ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిని లాస్ట్ వరల్డ్‌గా వారు పరిగణించారు. వారు కనిపెట్టిన ఈ సూక్ష్మ జీవులను ప్రోటోస్టెరాల్ బయోటా అంటారట. ఇవి యూకోరైట్స్ అనే జీవుల జాతులకు చెందినవి అని వారు భావిస్తున్నారు. ఈ జీవులు 1.6 బిలియన్ సంవత్సరాల క్రితం నీటిలోతులో జీవించేవని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. యూకోరైట్స్‌కు కూడా ఇతర జీవుల లాగా మైటోకోండ్రియా, న్యూక్లియస్ లాంటివి ఉంటాయని వారు చెప్తున్నారు.
ఇప్పుడు కూడా యూకోరైట్స్ జాతికి చెందిన జీవులు జీవనం కొనసాగిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాకపోతే అప్పటితో పోలిస్తే ఇప్పుడు వాటి రూపం చాలా మారిపోయిందన్నారు. మనుషులతో పాటు ఇతర జీవులకు కూడా యూకోరైట్స్ జాతికి సంబంధం ఉంటుందని వారు తెలిపారు. ఇప్పటివరకు తాము కనిపెట్టిన ఆనవాళ్లలో ఈ యూకోరైట్స్ ఆనవాళ్లు అతి పురాతనమైనవని వారు బయటపెట్టారు. ఇవి భూమి ఎకోసిస్టమ్‌ను మార్చడానికి అప్పట్లో ఎంతో కష్టపడి ఉంటాయని అంచనా వేస్తున్నారు.
యూకోరైట్స్ ఆనవాళ్లు అనేవి శాస్త్రవేత్తలు కనిపెట్టినా.. అవి అప్పట్లో ఎలా ఉంటాయి అనే విషయాన్ని మాత్రం వారు నిర్ధారించలేకపోతున్నారు. అప్పట్లో ఆస్ట్రేలియన్ సముద్రాల్లో ఇవి జీవించేవని వారు భావిస్తున్నారు. ఇవి దాదాపు 1.6 బిలియన్ సంవత్సరాల నుండి 800 మిలియన్ సంవత్సరాల క్రితం జీవనం సాగించి ఉంటాయని అనుకుంటున్నారు. భూమి అనేది అనేక మార్పులు చెందుతున్న క్రమంలో ఈ జీవాలు కనుమరుగయిపోయి ఉంటాయని ప్రాథమికంగా తేల్చారు. ఇక ఈ ఆనవాళ్ల గురించి మరిన్ని పరిశోధనలు చేస్తామని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.